రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన పీసిఎంఆర్ పాఠశాల విద్యార్థి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన అండర్ 17 హా కీ పోటీలలో రూపా రాజా పిసి ఎంఆర్ పాఠశాల విద్యార్థి గ్రంధే వెంకట అభిషిక్త్ (పదవ తరగతి) ప్రతిభ కనబరిచి, నెల్లూరులో నవంబర్ 3 నుంచి జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అనంతపురం జట్టు తరపున ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ హాకీ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన పీసిఎంఆర్ పాఠశాల విద్యార్థి)