UA-35385725-1 UA-35385725-1

ఇక ఉచిత గ్యాస్ సిలిండ‌ర్‌…ఎప్ప‌టి నుండి అంటే?

ఇక ఉచిత గ్యాస్ సిలిండ‌ర్‌…ఎప్ప‌టి నుండి అంటే?

• పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకే కూటమి ప్రభుత్వం

• “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ 

న్యూస్‌తెలుగు/ నిడదవోలు : నిడదవోలు: పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ మండలం డి. ముప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకొని ప్రజామోదం తర్వాత ఇంటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను మంత్రి అతికించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, నేతలు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు సాక్షాత్తు గ్రామ ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని మెచ్చుకున్నారన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” అని ప్రజలు విశ్వసించారు కాబట్టే భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారని మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పనితీరు బాగోలేదు కాబట్టే, ప్రజలను వంచించింది కాబట్టే ఇంటికి పంపించారని విమర్శించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనా కాలంలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం నెల రోజుల్లోనే చేసి చూపించిందన్నారు. చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో ఆ ఇళ్లు, ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అద్భుతంగా విరాజిల్లుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను 3 వేల నుండి 4వేలకు పెంచిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలతో కలిపి జూలై 1వ తేదీన ప్రజలకు ఇంటి వద్దనే రూ.7000 పెన్షన్ అదించామన్నారు. వాలంటీర్లు లేకపోయినా గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు, సెప్టెంబర్ లో గుమ్మం వద్దనే ఒకటో తేదీనే పెన్షన్లు అందించామని గుర్తుచేశారు. ఒక్కో సందర్భంలో ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందురోజే అందించామన్నారు. గత ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా వదలకుండా ఖజానాను ఖాళీ చేసి  రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వివరించారు. ప్రజల్లో వెలుగులు నింపేందుకు దీపావళి రోజు నుండే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. 100 రోజుల్లో చాలా మంచి పనులు చేశాం. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందుతాం. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఎంపీటీసీ ఎస్.సత్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి దుర్గేష్, ఎంపీడీవో శామ్యూల్, తహసిల్దార్  బి. నాగరాజు నాయక్, సర్పంచ్ నాగిరెడ్డి నాగదేవి, ఉప సర్పంచ్  బి. బ్రహ్మాజీ, స్థానిక నాయకులు వి సూర్యారావు, ఎం దుర్గారావు,  రంగా రమేష్, పాల వీరాస్వామి, మేడిచర్ల మాధవరావు, పెన్నాడ  యజ్జేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story : దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1