అమర్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం పట్టణంలో ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న అమర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక నిమగ్నం అనంతరం బుధవారం పాఠశాల ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఇందుమతి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సేవా గుణం కలిగించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ విద్యతోపాటు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల రానున్న కాలంలో ఎంతో లబ్ధి పొందుతారన్నారు. నిరంతరం విద్యార్థుల మేధాశక్తిని పెంచేందుకు అమర్ పాఠశాల కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ వి పోలేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : అమర్ పాఠశాలలో అన్నదాన కార్యక్రమం)