ధర్మవరంలో విచ్చలవిడిగా పవర్ లూమ్స్ మగ్గాలు!
– జేఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ లీలలు బట్టబయలు
– నిబంధనలకు విరుద్ధంగా ప్యూర్ టు ప్యూర్ చీరలు తయారీ
– జెట్లూమ్స్ ఏర్పాటు చేసి, భారీగా ఉత్పత్తులు
– తోటి నేతన్న ల కళ్ళు పొడిచి పొట్ట కొట్టారు
– ఇతర రాష్ట్రాల కూలీలతోనే పనులు
– జే ఆర్ స్పీడుకు తట్టుకోలేని చేనేతమగ్గాలు
– కాసులకు కక్కుర్తి పడి కళ్ళుండి మూసుకుపోయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
– పట్టణ చేనేత కార్మికులు, నాయకులు ఆవేదన
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): ధర్మవరం మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో ఉన్న జే ఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం బరితెగించింది అని చేనేత కార్మికుల జీవన విధానానికి పొట్ట కొడుతుందని, చేనేత కార్మికులు జీవించలేక ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారని పట్టణ చేనేత కార్మికులు, నాయకులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరేమైతే నాకేంటి నా జేబులు నిండితే చాలు అనుకున్నారో ఏమో? అన్నంత పనే చేస్తూ నేతన్నల కడుపు కొడుతున్నారు అని బాధని వ్యక్తం చేశారు. జే ఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని జింక రామాంజనేయులు అక్రమ లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అని తెలిపారు. ఈయన అక్రమాలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది అని, చేనేత 11 రకాల రిజర్వేషన్ల నిబంధనలకు విరుద్ధంగా ప్యూర్ చీరలు తయారు చేస్తూ చేనేత పరిశ్రమనే చిన్నాభిన్నం చేస్తున్నారు పని మండిపడ్డారు. ధర్మవరం చేనేత పరిశ్రమకు నేనే రారాజుగా వెలుగొందాలనుకుని జెట్లూమ్స్ ఏర్పాటు చేసి, దిగువ మధ్యతరగతి నేతన్నల కళ్ళు పొడిచి పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం అని తెలిపారు. ఈయన నిర్వాకం వల్ల పనులు లేక ఉన్న గిట్టుబాటు లేక బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి చేనేత పరిశ్రమలో ఏర్పడుతోంది అని, జే ఆర్ దాటికి తట్టుకోలేక ధర్మవరం చేనేత పరిశ్రమ కకా వికలమై పోతుందనడం లో ఎటువంటి సందేహం లేదు అని, భారీ ఎత్తున సబ్సిడీపై పరిశ్రమను ఏర్పాటు చేసి దాదాపు 200 పైగా జెట్లూమ్స్ ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్క లూ మ్స్ నుంచి రోజుకు 3 నుంచి 4 చీరలు తయారు చేస్తూనారని, అలా 200 ల్యూమ్స్ ద్వారా రోజుకు 600 నుంచి 800 ప్యూర్ టు ప్యూర్ చీరలు తయారు చేస్తూ అక్రమార్చనకు వడిగట్టే పరిస్థితి ఏర్పడుతోంది అని మండిపడ్డారు. తద్వారా నెలకు కోట్లాది రూపాయలు నిబంధన విరుద్ధంగా ఆర్జిస్తూ, పరిశ్రమ మనుగడకే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. విచారణ నిమిత్తం వచ్చే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ ఫ్యాక్టరీ లోకి ప్రవేశించగానే కళ్ళు మూసుకుపోతాయో ఏమో తెలియదు కానీ, అంతా సవ్యంగా నడుస్తోందని క్లీన్ చిట్ ఇవ్వడం సమంజసమేనా అని తెలిపారు. ఈ క్లీన్ చిట్ వెనక భారీ ఎత్తున ముడుపులందుతున్నట్లు విశ్వసినీయ సమాచారం ఉందని కూడా వారు తెలిపారు.
అడుగడుగున నిబంధనలు ఉల్లంఘిస్తూ..
జే ఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి ఎన్ఫోర్స్మెంట్ హ్యాండ్లూమ్ అధికారులు పూర్తిగా లాలూచీ పడడంతో, ఆయన అక్రమ తయారీకి అవధులు లేకుండా పోతున్నాయి అని తెలిపారు. దేశంలోనే అత్యాధునిక జెట్ లూమ్స్ ఏర్పాటు చేసుకొని యదేచ్చగా నిబంధనలో ఉల్లంఘిస్తూ భారీ ఎత్తున ఉత్పత్తులు తీసుకొని రావడం సభమేనా అని ప్రశ్నించారు. దాదాపు 100 కోట్లతో చేనేత పరిశ్రమను ఏర్పాటు చేసుకొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే భారీ ఎత్తున సబ్సిడీలు పొందుతూ నేతన్నులకు మాత్రం పని కల్పించకుండా, ఇతర రాష్ట్రాలకు కూలీలతో పనులు చేయించుకుంటూ, మరింత అన్యాయానికి పాల్పడే పరిస్థితి ఏర్పడటం జరిగిందన్నారు.నిబంధన ప్రకారం జెట్ లేదా పవర్ లూమ్స్ లో 11 రకాల రిజర్వేషన్లకు అనుగుణంగా ఇక్కడ ఉత్పత్తులు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా శాలువాలు, అర పట్టు, కంబల్లు, మిక్స్డ్ చీరలు తయారు చేసుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా దాదాపు 200 పైగా అత్యంత ఆధునిక పద్ధతిలో జెట్లూమ్స్ ఏర్పాటు చేసుకొని, దాదాపు నెలకు 20వేల నుంచి 25వేల పట్టు చీరలు తయారు చేయడం ద్వారా ఉత్పత్తులు భారీగా పెరిగి ఒకటి రెండు మగ్గాలు వేసుకున్న సామాన్య నేతన్నలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. జే ఆర్ యాజమాన్యం స్పీడుకు తట్టుకోలేక ఎందరో మగ్గాలను మడతేసే పరిస్థితి ధర్మవరంలో ఏర్పడుతోంది అని బాధని వ్యక్తం చేశారు. మరి ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు ఇస్తే స్థానికంగా ఉండే చేనేత కార్మికుల జీవన విధానం ఎలా కొనసాగుతుందని వారు మండిపడ్డారు.
రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు పుట్టినిల్లు లాంటిది ధర్మవరం అని, అలాంటి ప్రాంతంలో మగ్గాలు నేసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది అని, పరిశ్రమ మీదే ఆధారపడి జీవిస్తున్న స్థానిక నేతన్నలను వదిలేసి బీహార్, గుజరాత్ ఇతర రాష్ట్రాలకు చెందిన . కూలీలను పిలిపించుకొని పనిచేయించుకోవడం ద్వారా స్థానికులు పూర్తిగా ఉపాధిని కోల్పోయి, తద్వారా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ధర్మవరంలో ఏర్పడటం చాలా బాధను కల్పిస్తోందని తెలిపారు.
జింక రామాంజనేయులు స్వార్థానికి పరిశ్రమ కుదేలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందని తెలిపారు.
జెఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని జింక రామాంజనేయులు ద్వారా చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా ప్రస్తుతం ఆ పరిశ్రమ కుదేలైంది అని తెలిపారు. స్థానిక చేనేతలకు పనులు కల్పించకపోవడం వల్ల ఉపాధి లేక ఇతర వృత్తుల వైపు వెళ్లలేక, బాధలు అన్నీ ఇన్ని కావు అని,జేఆర్ సిల్క్స్ యాజమాన్యం ఇలాంటి వ్యక్తుల స్వార్థ చింతనకు చేనేత వ్యవస్థ కాకావికలమయ్యే పరిస్థితి ధర్మవరంలో దాపిరిస్తోందీ అని మండిపడ్డారు.
కాసులకు కక్కుర్తి పడి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని తెలిపారు.జే ఆర్ సిల్క్స్ యాజమాన్యం వల్ల భయము లేదా వారిచ్చిన కాసులకు కక్కుర్తి పడే ఏమో ఎన్ఫోర్స్మెంట్, అధికారులు ఆయనకు దాసోహం అవుతున్నారు అని తెలిపారు. చేనేత సంఘాలు తేనెతో పరిశ్రమంలోని కొందరు వ్యక్తులు ఫిర్యాదులు చేసిన అత్యంత సీక్రెట్ గా విచారణ నిర్వహించి అంతా బేశుగ్గా జరుగుతోంది అని,ఎటువంటి అక్రమాలు జరగలేదంటూ తాపీగా చెప్పడం చూస్తుంటే ఏ స్థాయిలో ముడుపులందుతున్నాయో చెప్పనక్కర్లేదని తెలిపారు. అదే చిన్న పాటి నేతన్నల మగ్గాలపై విచారణ పేరుతో కేసులు పెట్టి, వారిని మరింత కృంగదీస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారన్న అపవాదను అధికారులు మూటగట్టుకున్నారు అని తెలిపారు.ఓ మంత్రి పేరు చెప్పుకొని బెదిరింపులు లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జే ఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఓ మంత్రి పేరు వాడుకొని అటు అధికారులను ఇటు నేతనులపై తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారన్న విమర్శలు పట్టణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి అని తెలిపారు. తన ఫ్యాక్టరీకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఎన్నికల ముందు ఓ పార్టీని ఆశ్రయించి, ఆ పార్టీ ద్వారా చేనేత పరిశ్రమనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు అని తెలిపారు. ఇటువంటి అక్రమార్కులకు రాజకీయం అండగా ఉన్నంతవరకు ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా జెఆర్ సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలను బయటపెట్టి, చేనేత పరిశ్రమతో పాటు చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు. (Story: ధర్మవరంలో విచ్చలవిడిగా పవర్ లూమ్స్ మగ్గాలు!)