ములుగు జిల్లా అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
న్యూస్ తెలుగు /ములుగు : ములుగు జిల్లా అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో ములుగు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్ రావు , భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలోని నంది పహాడ్ గుత్తి కోయ హాబిటేషన్ ను సందర్శించి గిరిజనుల జీవన శైలి విధానాన్ని గుర్చు వారిని అడిగి తెలుసుకున్నారు. మెడికల్ అండ్ హెల్త్ అంశంలో గిరిజనులకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమవుతాయో అనే అంశాలపై చర్చించారు.
అనంతరం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధుల తో కలెక్టర్ తన చాంబర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్ విషయంలో గుత్తి కోయ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలను త్వరలోనే పంపిస్తామని తెలిపారు. (Story : ములుగు జిల్లా అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలి)