ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలు
న్యూ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమ్) ను రోటరీ క్లబ్ వారు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి అల్ట్రాటెక్ సిమెంట్ వారి సహాయ సహకారంతో కలిసి జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూ కాలేజ్ ప్రొఫెసర్ హేమ్చంద్రారెడ్డి హాజరు కావడం జరిగింది. తదుపరి హేమచంద్ర రెడ్డి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను గూర్చి వారు కొనియాడారు. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండాలని అలాంటి గొప్ప వ్యక్తులు అవసరం ఎంతో ఉందని ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు గుణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో మంచి సేవలు అందిస్తూ భారతదేశము యొక్క ఔన్నత్యానికి ఎంతో సహాయ సహకార అందించాలని తెలిపారు. తదుపరి రోటరీ క్లబ్ వారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి ,రోటరీ సభ్యులు, ఇన్నర్ వీల్ సభ్యులు, పట్టణ ఇంజనీర్లు, రోటరీ సెక్రెటరీ నాగభూషణం, కోశాధికారి సుదర్శన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలు)