తోటి చేనేత కార్మికునికి, చేనేతల కార్మికుల ఆర్థిక సహాయం అందజేత
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన వ్యక్తి తారకరామాపురంలో నీలూరు నాగరాజ్ చేనేత కార్మికులుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంతలో భార్యకు పక్షవాతం రావడం, భర్త నీలూరి నాగరాజుకు తీవ్ర అనారోగ్య పరిస్థితి ఎదురు కావడం జరిగింది. ఒక పూట కూడా తిండి జరగలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ తారక రామాపురంలో ఉండే చేనేత కార్మికులు అందరూ కలిసి ఆ కుటుంబానికి రూ.26,500 నగదును సహాయంగా అందించారు. ఈ సహకారం అందించిన వారిలో శేషాద్రి, పూజారి లక్ష్మీనారాయణ, శేఖర్, సూరి, శ్రీహరి, మధుసూదన్, కమలాకర్, ఆదిశేషులు ఉన్నారు. (Story :తోటి చేనేత కార్మికునికి, చేనేతల కార్మికుల ఆర్థిక సహాయం అందజేత)