మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ పర్యటన
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈనెల 15 తేదీ నుండి 17వ తేదీ వరకు నియోజకవర్గంలోని పలు మండలాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ బెంగళూరు నుండి 15వ తేదీ ఉదయం ఏడు గంటలకు బై రోడ్డు ద్వారా 10:30 గంటలకు ధర్మవరం చేరుకుంటారని తదుపరి 11 గంటలకు లోకల్ గా గల కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. తదుపరి 16వ తేదీ ఉదయం 11 గంటలకు పుట్టపర్తిలో వర్కింగ్ జర్నలిస్ట్ మీటింగ్లో పాల్గొంటారని, తిరిగి మధ్యాహ్నం ఒకటిన్నరకు ధర్మవరం చేరుకుంటారని తెలిపారు. తదుపరి మూడు గంటలకు రైల్వే స్టేషన్లో బ్యాటరీ వెహికల్ రవాణా చేయు కార్యక్రమంలో పాల్గొంటారని, సాయంత్రం నాలుగు గంటలకు అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ టోర్నమెంట్లో ప్రైజులను పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం అనంతపురంకి బయలుదేరతారని తెలిపారు. తిరిగి 17వ తేదీన ఉదయం 10 గంటలకు ధర్మవరంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని తదుపరి అనంతపురానికి వెళతారని తెలిపారు. అనంతరం ఇదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సందర్శిస్తారని తెలిపారు. తిరిగి 18వ తేదీ సాయంత్రం విజయవాడకు బయలుదేరుతారని తెలిపారు.(Story : మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ పర్యటన)