పంట కోతలు వాయిదా వేసుకోండి!
న్యూస్ తెలుగు/సాలూరు: రెండు రోజుల్లో తుపాను ఉన్న నేపధ్యంలో వరి పంటల కోతలను వాయిదా వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కె. శిరీష తెలియచేశారు. రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. గుమడాం , శివరాంపురం గ్రామాల్లో పంటల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటల రైతులకు తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి కోతలను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే కోతలు పూర్తిచేసిన పంటలను పొలంలో ఆరబెట్టిన పనలు ఉంటే, వాటిని వెంటనే కట్టలుగా కట్టి ఎత్తైన ప్రదేశంలో చిన్న చిన్న కుప్పలుగా వేసి, వాటిపై టార్పాలిన్ పట్టాలు లేదా ప్లాస్టిక్ కవర్లు కప్పాలి. గాలికి. ఎగిరిపోకుండా పట్టాల అంచుల పై బరువు పెట్టాలి. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పంటల కోత, ఆరబెట్టడం, నిల్వ, రక్షణ చర్యలను పాటించాలని మండల వ్యవసాయ అధికారి కె. శిరీష కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఈఓ తిరుపతిరావు, వీఏఏ మనోజ్ పాల్గొన్నారు. (Story: పంట కోతలు వాయిదా వేసుకోండి!)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
