Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చట్టి గ్రామపంచాయతీ ఏకగ్రీవం

చట్టి గ్రామపంచాయతీ ఏకగ్రీవం

0

చట్టి గ్రామపంచాయతీ ఏకగ్రీవం

న్యూస్‌తెలుగు/చింతూరు: పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయింది.చట్టి లో జరిగిన గ్రామసభ ద్వారా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ నిమిత్తం గ్రామస్తుల సమక్షంలో పార్టీలకు అతీతంగా గ్రామసభ అత్యంత కీలకంగా నిర్వహించారు. గ్రామసభను గౌరవించి గ్రామ అభివృద్ధి నిమిత్తం గ్రామ సర్పంచ్ అభ్యర్థి, వార్డు నెంబర్లను ఏకగ్రీవంగా చట్టి గ్రామపంచాయతీ గ్రామసభ నిర్ణయం తీసుకున్నారు . నిర్ణయంతో అభ్యర్థులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ సర్పంచ్‌గా తుర్రం చిన్న ముత్తయ్యను ఎన్నుకున్నారు. అలాగే 10 వార్డులకు గాను వార్డు నెంబర్ లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు యువతి యువకులు మహిళలు అందరూ ఏకాగ్రీవాన్ని తెలియజేసి గ్రామ సభను గౌరవించారు. (Story: చట్టి గ్రామపంచాయతీ ఏకగ్రీవం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version