చింతూరులో రోడ్డు ప్రమాదం…ఒకరి మృతి
న్యూస్‌తెలుగు/చింతూరు: చింతూరులోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ముందు ఆదివారం ఉదయం స్పీడ్ తో వచ్చిన లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే విఆర్ పురం మండలం చింతరేవుపల్లి గ్రామానికి చెందిన ముత్యాల రాజకుమార్ (22) తన స్నేహితుడు దుర్గాప్రసాద్ ఇద్దరు కలిసి మోతుగూడెం సమీపంలోని పోల్లూరు గ్రామంలోని దారాలమ్మ గుడికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. చింతూరు చేరగానే లారీ స్పీడ్ గా రావడంతో దుర్గాప్రసాద్ రోడ్డు బయట వైపుకు దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్ కుమార్ లారీ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కరెక్టుగా లారీ వెనుక టైర్ల కింద పడటంతో తల మొత్తం చిద్రమైపోయింది. స్నేహితుడు కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడంతో దుర్గాప్రసాద్ షాక్ కు గురయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుని గమనించారు. మృతుడి వివరాలు తెలుసుకున్నారు. ఎవరు ఏమిటని చూడకుండానే, మృతదేహాన్ని స్వయంగా ఎస్సై రోడ్డు పక్కకి జరిపి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. (Story: చింతూరులో రోడ్డు ప్రమాదం…ఒకరి మృతి)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
