Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ‘అక్వాన్’ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

‘అక్వాన్’ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

“అక్వాన్” తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి… జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి

న్యూస్‌తెలుగు/చింతూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో, తుపాను ప్రభావంతో నవంబర్ 17, 18, 19, 20, 21 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలవరం జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి సూచించారు.
పోలవరం జిల్లాలోని 12 మండలాలైన రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, గంగవరం, వై. రామవరం, మారేడుమిల్లి, దేవీపట్నం, చింతూరు, ఎటపాక, వర రామచంద్రపురం, గుర్తేడు తదితర మండలాల్లో తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా, రహదారులు, రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మూగజీవాలకు, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, వాగులు, వంకలు, సెలయేర్లు అధికంగా ఉన్న పోలవరం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
తుపాను కారణంగా రహదారులపై కూలిపోయిన చెట్లను తక్షణమే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని – నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని .
ప్రమాదకరమైన వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలన్నారు.డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయాలని కోరారు.తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండి అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు .- అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని . ముఖ్యంగా వాగులు, వంకలు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు .
నిత్యావసర ఆహార పదార్థాలు, తాగునీరు ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని .
మొబైల్ ఫోన్లను పూర్తిస్థాయిలో ఛార్జింగ్ చేసుకోవడంతో పాటు అవసరమైన అత్యవసర సౌకర్యాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు .
విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని – అధికారుల సూచనలు, వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలన్నారు .
ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైనా పోలవరం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తుపాను సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని, ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి కోరారు. (Story: ‘అక్వాన్’ తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version