కనకదుర్గమ్మ వారికి స్వర్ణాభరణాల సమర్పణ

ఇంద్రకీలాద్రి, 16 నవంబర్ 2026: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి కార్తీక మాసం పురస్కరించుకుని ఒక భక్త కుటుంబం భక్తిశ్రద్ధలతో స్వర్ణ కానుకలను సమర్పించారు.
విజయవాడ వన్ టౌన్‌కు చెందిన భక్తులు CH. L. G. ప్రసూనాంబ, CH. G. S. V. ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం దేవస్థాన కార్యాలయానికి విచ్చేశారు.
శ్రీ అమ్మవారి మూలవిరాట్ అలంకరణ నిమిత్తం 192.500 గ్రాముల బంగారు కాసుల పేరు, 104.300 గ్రాముల బంగారు సూత్రాలు, గొలుసులను (మొత్తం 296.800 గ్రాముల బంగారు ఆభరణాలను) దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనా నాయక్ సమక్షంలో ఆలయానికి అందజేశారు.
స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, దేవస్థాన అధికారులు ఆలయ నిబంధనల ప్రకారం ఈ ఆభరణాలను స్వీకరించి దాతలకు రశీదును అందజేశారు. అనంతరం దాతల కుటుంబానికి శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

కర్ణాటక రాష్ట్రం రాయచూర్ కు చెందిన శిరీష అనే భక్తురాలు ఈరోజు ఉదయం 63 గ్రాముల బంగారు హారం కనకదుర్గ అమ్మవారి అలంకరణ నిమిత్తం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )కు అందజేశారు.
ఆలయ నిబంధనలు ప్రకారం భక్తులకు రసీదు అందజేసి శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. (Story: కనకదుర్గమ్మ వారికి స్వర్ణాభరణాల సమర్పణ)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

