టీసీఐ సీవేస్ నౌకా సముదాయంలోకి 500 టీఈయూ కంటైనర్ నౌక ‘టీసీఐ సేతు’
వ్యూహాత్మక చేరికతో పర్యావరణహిత తీరప్రాంత షిప్పింగ్
నిర్వహణ సామర్థ్యం, సమీకృత మల్టీమోడల్ లాజిస్టిక్స్ పట్ల టీసీఐ నిబద్ధత మరింత బలోపేతం
న్యూస్ తెలుగు/విశాఖపట్నం: సుస్థిర లాజిస్టిక్స్, దేశ తీరప్రాంత షిప్పింగ్ మౌలిక సదుపాయాల పట్ల తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (టీసీఐ)కు చెందిన విభాగం టీసీఐ సీవేస్ 2026 అక్టోబర్ 29న 500 టీఈయూ కంటైనర్ నౌక టీసీఐ సేతు (TCI SETU)ను అందుకుంది.
సుమారు 7,300 మెట్రిక్ టన్నుల డెడ్‌వెయిట్ సామర్థ్యం గల టీసీఐ సేతు, టీసీఐ సీవేస్ నౌకా సముదాయంలో ఏడో నౌక. ఇప్పటికే ఉన్న ఆరు నౌకలకు ఇది జత కలిసింది. దేశంలో పెరుగుతున్న తీరప్రాంత సరుకు రవాణా అవసరాలను, ముఖ్యంగా తూర్పు తీరంలో, తీర్చే సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది. తూర్పు తీరంలో టీసీఐ సీవేస్ చెన్నై, విశాఖపట్నం, అండమాన్ దీవులు, మయన్మార్‌లను అనుసంధానిస్తోంది.
చైనాకు చెందిన తైఝౌ సాన్ఫు షిప్ ఇంజినీరింగ్ కో. లిమిటెడ్ నిర్మించిన ఈ నౌకను అత్యుత్తమ నిర్మాణ నాణ్యత, విశ్వసనీయ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యం లక్ష్యంగా రూపొందించారు. తక్కువ కర్బన ఉద్గారాలతో పనిచేసే ఈ నౌక మరింత పరిశుభ్రమైన, సుస్థిర సముద్ర రవాణా దిశగా మార్పునకు తోడ్పడుతుంది.
టీసీఐ సేతుపై ₹178.8 కోట్ల పెట్టుబడి పెట్టగా, ఆ మొత్తాన్ని పూర్తిగా అంతర్గత నిధుల (ఇంటర్నల్ అక్రూవల్స్) నుంచే సమకూర్చారు. ఈ షిప్‌యార్డ్‌తో ఒప్పందం చేసుకున్న రెండు నౌకల్లో ఇది మొదటిది.
మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ, “టీసీఐలో మేము తీరప్రాంత షిప్పింగ్‌ను భారతదేశ భవిష్యత్ లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలకు కీలక స్తంభంగా చూస్తున్నాం. సాంకేతికత, నిర్వహణ నైపుణ్యం, సుస్థిర రవాణాలో పెట్టుబడులు పెట్టడంపై మా నిరంతర నిబద్ధతకు టీసీఐ సేతు నిదర్శనం. సమర్థవంతమైన తీరప్రాంత షిప్పింగ్‌ను మా విస్తృత రోడ్డు, రైలు సామర్థ్యాలతో అనుసంధానించడం ద్వారా మరింత సమీకృత, తక్కువ వ్యయంతో కూడిన, పర్యావరణ బాధ్యత గల మల్టీమోడల్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నాం. ఇది కేవలం మా నౌకా సముదాయాన్ని విస్తరించడం మాత్రమే కాదు. భారతీయ లాజిస్టిక్స్‌కు మరింత పర్యావరణహితమైన, మరింత అనుసంధానిత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భాగస్వాములం కావడమే దీని ఉద్దేశం” అని పేర్కొన్నారు.
లాజిస్టిక్స్ సామర్థ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కర్బన ఉద్గారాల తగ్గింపుపై భారత్ దృష్టిని వేగవంతం చేస్తున్న నేపథ్యంలో, సమతుల్యమైన, సుస్థిర రవాణా వ్యవస్థలో తీరప్రాంత షిప్పింగ్ మరింత పెద్ద పాత్ర పోషించనుంది. ఆధునిక నౌకా సాంకేతికతలో పెట్టుబడులు, నౌకా సముదాయాన్ని బలోపేతం చేయడం, మల్టీమోడల్ అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని టీసీఐ సీవేస్ కొనసాగిస్తుంది. (Story: టీసీఐ సీవేస్ నౌకా సముదాయంలోకి 500 టీఈయూ కంటైనర్ నౌక ‘టీసీఐ సేతు’)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!
