Home వార్తలు ధనత్రయోదశికి ఫోన్‌పే 24కే డిజిటల్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌

ధనత్రయోదశికి ఫోన్‌పే 24కే డిజిటల్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌

0

ఫోన్‌పే 24K డిజిటల్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ధనత్రయోదశిని ఘనంగా జరుపుకోండి

ఈ పండుగ సీజన్‌లో యూజర్లు ₹2,000 వరకు ఫ్లాట్ 2% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు

ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌పై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పే ద్వారా కనీసం ₹2,000 విలువైన డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసినప్పుడు యూజర్లు ఫ్లాట్ 2 శాతం క్యాష్‌బ్యాక్ (₹2000 వరకు) పొందవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 6, 2026న ఒక్కసారి చేసే లావాదేవీపై మాత్రమే వర్తిస్తుంది* (ఒక యూజర్​కి ఒక్కో యూజర్‌కు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది, SIP లావాదేవీలకు వర్తించదు).

ఈ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు కనీసం ₹2,000 విలువైన 24 క్యారెట్ల డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ రూపంలో కొనుగోలు చేసిన సర్టిఫైడ్ 24 క్యారెట్ల బంగారానికి ఎటువంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు, పైగా దీనిని ఉచిత బ్యాంక్ స్థాయి లాకర్లలో భద్రపరుస్తారు. దాచుకున్న ఈ బంగారాన్ని ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, అలా అమ్మిన 48 గంటల్లోపే ఆ డబ్బు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది.

అత్యున్నత నాణ్యత గల స్వచ్ఛమైన బంగారాన్ని అందించేందుకు ప్రముఖ సంస్థలైన MMTC-PAMP, SafeGoldతో ఫోన్‌పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. పారదర్శకమైన ధరల విధానంతో, దేశవ్యాప్తంగా ఇప్పటికే అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసిన 2.9 కోట్లకు పైగా కస్టమర్లకు ఈ ప్లాట్‌ఫామ్ ఒక నమ్మకమైన ఎంపికగా మారింది.

ఫోన్‌పేలో బంగారం కొనుగోలు చేస్తూ ఈ ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందేందుకు దశలవారీ విధానం ఇక్కడ చూడవచ్చు:

  1. ఫోన్‌పే హోంపేజీలోని Buy Gold/బంగారం కొనండి ఐకాన్‌పై క్లిక్ చేయండి.

  1. “Buy in rupees/రూపాయల్లో కొనండి” ఎంచుకుని, కనీసం ₹2000 విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని యాడ్ చేసి కొనసాగండి.

  1. మీ బంగారు కొనుగోలు ఫైనల్ వివరాలను సరిచూసుకుని, “Proceed to Pay/చెల్లించడానికి కొనసాగించండి”పై క్లిక్ చేసి, ఆఫర్‌ పొందండి.

*ఈ ఆఫర్ 6 నవంబర్ 2026, 00:00 AM నుండి 6 నవంబర్ 2026, 11:59 PM వరకు అదీ ఒకేసారి చేసే లావాదేవీలకు మాత్రమే చెల్లుతుంది. కనీస ఆర్డర్ విలువ ₹2000. SIP లావాదేవీలకు వర్తించదు. ఒక్కో యూజర్​కి ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. (Story: ధనత్రయోదశికి ఫోన్‌పే 24కే డిజిటల్ గోల్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version