Home వార్తలు ఐసీఐసీఐ లైఫ్ గ్యారంటీడ్ ఇండెక్స్‌డ్ పెన్షన్ ప్లాన్ ఆవిష్కరణ

ఐసీఐసీఐ లైఫ్ గ్యారంటీడ్ ఇండెక్స్‌డ్ పెన్షన్ ప్లాన్ ఆవిష్కరణ

0

ఇండెక్స్-ఆధారిత వృద్ధి అవకాశాలు, జీవితాంతం గ్యారంటీడ్ ఆదాయాన్ని అందించే ఫీచర్లతో ఐసీఐసీఐ లైఫ్ గ్యారంటీడ్ ఇండెక్స్‌డ్ పెన్షన్ ప్లాన్ ఆవిష్కరణ

  • జీవితాంతం నిర్దిష్టంగా నిర్ణయించబడిన కచ్చితమైన ఆదాయం1
  • మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు కస్టమర్లకు తోడ్పడుతూనే, రిటైర్మెంట్ అనంతరం మరింత మెరుగైన ఆదాయం పొందేందుకు కూడా ఉపయోగపడేలా నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌కు అనుసంధానించబడిన వేరియబుల్ ఇన్‌కం2
  • రిటైర్మెంట్ ఆదాయాన్ని మేనేజ్ చేసుకునేందుకు ఇతరత్రా వెసులుబాట్లతో పాటు జాయింట్ లైఫ్ బెనిఫిట్4, రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైజ్3 ఆప్షన్లు

ముంబై: గ్యారంటీడ్ యాన్యుటీ1 మరియు వేరియబుల్ యాన్యుటీ2 ప్రయోజనాలను కలిపి అందించేలా ఐసీఐసీఐ లైఫ్ గ్యారంటీడ్ ఇండెక్స్‌డ్ పెన్షన్ పేరిట ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఒక రిటైర్మెంట్ ఇన్‌కం పథకాన్ని ఆవిష్కరించింది. ఇందులోని గ్యారంటీడ్ భాగమనేది కస్టమర్లకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అలాగే వేరియబుల్ భాగమనేది ఇండెక్స్ ఆధారిత ఆదాయం రూపంలో ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పిస్తుంది.

కచ్చితమైన యాన్యుటీ భాగాన్ని 60 శాతం నుంచి 100 శాతం వరకు ఎంచుకునే వెసులుబాటు ఈ ప్రోడక్టులోని ప్రత్యేక ఫీచరు. మిగతా మొత్తాన్ని నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌కి అనుసంధానించవచ్చు. తద్వారా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన రాబడులను అందుకునే అవకాశాలు కస్టమర్లకు లభిస్తాయి.

“ఆయుర్దాయాలు పెరుగుతున్న కొద్దీ ప్రజలు రిటైర్మెంట్ అనంతరం సుదీర్ఘ కాలానికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటోంది. జీవన వ్యయాలు పెరిగిపోతుండటం, ఆర్థిక ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో మార్కెట్‌తో అనుసంధానమై అధిక ఆదాయ వృద్ధి అవకాశాలతో పాటు స్థిరమైన ఆదాయాన్ని కూడా అందించే రిటైర్మెంట్ సొల్యూషన్స్‌ ఆవశ్యకత పెరుగుతోంది.

ఐసీఐసీఐ లైఫ్ గ్యారంటీడ్ ఇండెక్స్‌డ్ పెన్షన్‌ పథకంతో కస్టమర్లు తమకు సౌకర్యవంతమైన స్థాయిలో కచ్చితమైన ఆదాయం పొందే ఆప్షన్‌ను ఎంచుకోవడంతో పాటు మార్కెట్ పనితీరుతో ప్రయోజనం పొందే అవకాశాలను కూడా పొందవచ్చు. ఆర్థిక భద్రత భరోసాను పొందడం ద్వారా పదవీ విరమణ అనంతర జీవితానికి సంబంధించి ధీమాగా ప్రణాళికలు వేసుకోవచ్చు.

రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైజ్3తో పాటు సింగిల్-లైఫ్, జాయింట్-లైఫ్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. దురదృష్టవశాత్తు యాన్యుటెంట్ మరణించినా లేదా ఆఖరు యాన్యుటెంట్ కన్నుమూసినా, చెల్లించబడిన మొత్తం ప్రీమియంలకు సరిసమానమైన డెత్ బెనిఫిట్‌, నామినీకి చెల్లించబడుతుంది” అని ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ Mr. వికాస్ గుప్తా తెలిపారు.

యాన్యుటీ అడ్వాన్స్ ఫీచరు5 ద్వారా కస్టమర్ల తక్షణ లిక్విడిటీ అవసరాలను కూడా తీర్చే విధంగా ఈ పథకంలో మరో వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ ఫీచరుతో తదుపరి ఐదేళ్ల గ్యారంటీడ్ యాన్యుటీ1లో 99 శాతం వరకు మొత్తాన్ని కస్టమర్లు ముందుగానే ఒకేసారి పొందవచ్చు. తమకు కీలకమైన సమయంలో తక్షణం నగదు చేతిలో ఉండేలా చూసుకోవచ్చు.   తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నెలవారీ, త్రైమాసికాలవారీ, ఆరు నెలలకోసారి లేదా ఏడాదికోసారి యాన్యుటీ పేఅవుట్‌లను పొందే ఆప్షన్‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు.

కస్టమర్లకు ఈ ప్రోడక్టు పలు వేల్యూ యాడెడ్ సేవలుV కూడా అందిస్తుంది. తమ రిటైర్మెంట్ అవసరాలకు అనుగుణంగా వారు హెల్త్ మేనేజ్‌మెంట్ మరియు వెల్‌నెస్ సర్వీసులను పొందేందుకు తోడ్పడుతుంది.

ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క రిటైర్మెంట్ సొల్యూషన్స్ పోర్ట్‌ఫోలియో మరింత పటిష్టమయ్యేందుకు ఈ ప్రోడక్టు దోహదపడుతుంది. కస్టమర్లు తమ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలకు తగ్గట్లు ప్రణాళికలు వేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ‘హర్ కల్ ఆసాన్’ అంటూ భాగస్వాములందరికీ కంపెనీ బ్రాండ్ ఇచ్చే భరోసాకు అనుగుణంగా ఇది ఉంటుంది. (Story: ఐసీఐసీఐ లైఫ్ గ్యారంటీడ్ ఇండెక్స్‌డ్ పెన్షన్ ప్లాన్ ఆవిష్కరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version