Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అర్నాబ్ అల‌జ‌డి!

అర్నాబ్ అల‌జ‌డి!

0

అర్నాబ్ అల‌జ‌డి!

న్యూస్ తెలుగు/అమ‌రావ‌తి: అర్నాబ్ తుపాన్ ఆంధ్రాలో అల‌జ‌డి సృష్టిస్తోంది. ఇప్ప‌టికే చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రిన్ని ప్రాంతాల‌కు ఇది విస్త‌రించ‌నున్న‌ది. తెలంగాణ‌లోని ఖ‌మ్మం, కొత్త‌గూడెం ప్రాంతాల‌నూ ఇది వ‌ద‌ల్లేదు. తాజాగా ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల‌ను ఈ తుపాను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. అర్నబ్ తుపాన్‌ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తుపాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వివిధ శాఖలు చేపట్టిన ముందస్తు సన్నద్ధత, ప్రజల భద్రత, అత్యవసర సహాయక చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్‌, హోం మంత్రి వంగలపూడి అనితలు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాన్‌ పరిస్థితులను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సంస్థ న నుంచి అధికారులు జిల్లాల్ల‌లోని ప‌రిస్థితుల‌ను రేయింబ‌వ‌ళ్లు నిరంత‌రాయంగా ప‌ర్య‌వేక్షిస్తూ ఎక్క‌డా కూడా ఎలాంటి స‌మన్వ‌య లోపం లేకుండా చూస్తున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, ముందస్తు ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు 14 జిల్లాలకు 12 ఎన్డీఆర్‌ఎఫ్‌, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో 2,131 తుపాన్‌ షెల్టర్లను సిద్ధం చేశారు. 18 జిల్లాల్లో 2.70 కోట్ల మంది మొబైల్‌ ఫోన్లకు నిరంతరం తుపాన్‌ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ 30,043 ఫిషింగ్‌ బోట్లను తీర ప్రాంతాల్లో నిలిపివేశారు. ప్ర‌స్తుతం ఒక్క ఫిషింగ్ బోటు కూడా స‌ముద్రంలో లేకుండా జాగ్ర‌త్త‌లు పాటించారు.

వైద్య సేవలు, అత్యవసర సదుపాయాలు సిద్ధం

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 1,087 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. 8,281 అత్యవసర పడకలు, 1,274 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.

పాముకాటు బాధితులకు సకాలంలో చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో 21,536 యాంటీ స్నేక్‌ వీనం డోసులను అందుబాటులో ఉంచారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 1,351 మంది గర్భిణులను ఇప్పటికే సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా 2,613 నీటి ట్యాంకర్లు, 2,430 జనరేటర్లు, 4,448 ఆర్వో ప్లాంట్లను సిద్ధం చేశారు.

నిత్యావసర సరుకుల నిల్వలు.. రైతులకు సూచనలు

తుపాన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత తలెత్తకుండా 14,686 రేషన్‌ దుకాణాల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ముందుగానే నిల్వ చేశారు. పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని 35.96 లక్షల మంది రైతులకు సూచనలు జారీ చేశారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల పంటలకు నష్టం కలగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ వసతి గృహాలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ముఖ్యంగా 419 గిరిజన హాస్టళ్లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ హాస్టళ్లలో నివసిస్తున్న 88,083 మంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

రహదారుల పునరుద్ధరణకు యంత్రాలు సిద్ధం

తుపాన్‌ ప్రభావంతో చెట్లు కూలడం, రహదారులకు అంతరాయం ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రోడ్లు, భవనాల శాఖ 550 జేసీబీలు, 596 ఎలక్ట్రిక్‌ రంపాలను సిద్ధంగా ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,079 జలాశయాల వద్ద పరిస్థితులను అధికారులు నిరంతరం సమీక్షిస్తూ, నీటిమట్టాలు తదితర అంశాలను పర్యవేక్షిస్తున్నారు.

ఆర్టీజీఎస్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ

తుపాన్‌ సంబంధిత పరిణామాలు, జిల్లాల్లో ముందస్తు సన్నద్ధత, అత్యవసర సేవల లభ్యతను ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో చేపట్టిన ముందస్తు సన్నద్ధత చర్యలను ఆర్టీజీ కార్యదర్శి భాస్కర్‌ కాటంనేని, ఆర్టీజీఎస్‌ సీఈఓ ప్రఖర్‌ జైన్‌ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాన్‌ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, అవసరమైన సమాచారాన్ని సంబంధిత జిల్లా యంత్రాంగాలకు చేరవేస్తున్నాయి. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర యంత్రాంగం దృష్టి సారించింది.

‘అర్నాబ్’ (Arnab) అనేది బంగాళాఖాతంలో లేదా అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానులకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఆమోదించిన అధికారిక జాబితాలోని పేరు.
ఈ తుపాను పేరు, దాని తీవ్రత మరియు స్థితికి సంబంధించిన పూర్తి వివరాలు:

1. ‘అర్నాబ్’ అంటే ఏమిటి? ఈ పేరు ఎలా వచ్చింది?
పేరు పెట్టిన దేశం: ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని దేశాల కోసం రూపొందించిన 169 పేర్ల కొత్త జాబితాలో ‘అర్నాబ్’ పేరును బంగ్లాదేశ్ ప్రతిపాదించింది.

అర్థం: బెంగాలీ భాషలో ‘అర్నాబ్’ (Arnab) అంటే “సముద్రం”, “మహాసముద్రం” లేదా “తరంగం” అని అర్థం.

2. తుపాను తీవ్రత వర్గీకరణ
తుపాను తీవ్రతను అది సృష్టించే గాలుల వేగం ఆధారంగా వర్గీకరిస్తారు:

తీవ్ర వాయుగుండం (Deep Depression): గంటకు 52 – 61 కి.మీ. వేగం.

సాధారణ తుపాను (Cyclonic Storm – Arnab): గంటకు 62 – 88 కి.మీ. వేగం. (ఈ దశకు చేరినప్పుడే దానికి అధికారికంగా ‘అర్నాబ్’ అనే పేరు ఖరారవుతుంది).

తీవ్ర తుపాను (Severe Cyclonic Storm): గంటకు 89 – 117 కి.మీ. వేగం.

అతి తీవ్ర తుపాను (Very Severe Cyclonic Storm): గంటకు 118 – 165 కి.మీ. వేగం.

అత్యంత తీవ్ర తుపాను (Extremely Severe Cyclonic Storm): గంటకు 166 – 220 కి.మీ. వేగం.

సూపర్ సైక్లోన్ (Super Cyclone): గంటకు 221 కి.మీ. అంతకంటే ఎక్కువ వేగం.

3. ప్రస్తుత పరిస్థితి-ప్రభావం
అల్పపీడనం వాయుగుండంగా మారి, గాలుల వేగం గంటకు 62 కి.మీ. దాటినప్పుడు భారత వాతావరణ శాఖ (IMD) తదుపరి విడత తుపానుగా ఈ పేరును ప్రకటిస్తుంది.
ఈ తరహా తుపానులు బంగాళాఖాతంలో బలపడినప్పుడు తీరప్రాంతాలపై ప్రధానంగా మూడు రకాల ప్రభావాలు ఉంటాయి:
తీవ్రమైన ఈదురుగాలులు: పెంకుటిళ్లు, తాత్కాలిక నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం.
భారీ నుంచి అతి భారీ వర్షాలు: లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, పంటలకు నష్టం.
ఎగసిపడే అలలు (Storm Surge): తీరప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడం.

1. ఆంధ్రప్రదేశ్ తీరంపై ప్రభావం
తుపాను ఉత్తర ఆంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) లేదా మధ్య/దక్షిణ తీరం (కోనసీమ, కాకినాడ, కృష్ణా, బాపట్ల, నెల్లూరు) వైపు కదిలే క్రమంలో:
వర్షపాతం: తీరం దాటే ప్రాంతంతో పాటు సమీప జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు (Extremely Heavy Rainfall) కురుస్తాయి. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు పొంగిపొర్లడం జరుగుతుంది.
గాలుల వేగం: తీరం సమీపించే సమయంలో గంటకు 80 నుండి 120 కి.మీ. (తీవ్రతను బట్టి అంతకంటే ఎక్కువ) వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. చెట్లు కూలడం, విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడం సర్వసాధారణం.
వ్యవసాయ నష్టం: వరి కోతల దశలో ఉన్నప్పుడు లేదా చేతికందిన పంటలపై నీరు నిలవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అరటి, బొప్పాయి, ఉద్యానవన పంటలు ఈదురుగాలులకు తీవ్రంగా దెబ్బతింటాయి.
సముద్రపు అలల ఉధృతి (Storm Surge): తీరం దాటే సమయంలో 1 నుండి 2 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడి తీరప్రాంత గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉంటుంది.

2. ఒడిశా తీరంపై ప్రభావం
ఒడిశాలోని దక్షిణ తీర జిల్లాలు (గంజాం, గజపతి) అలాగే ఉత్తర/మధ్య జిల్లాలు (పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపడా, భద్రక్, బాలాసోర్) తుపానుల తాకిడికి గురవుతుంటాయి:
తీవ్ర గాలులు & వర్షాలు: తుపాను ఒడిశా వైపు మళ్లే కొద్దీ తీరప్రాంతం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశా నదులు (బ్రాహ్మణి, బైతరణి, మహానది పరివాహక ప్రాంతాలు) ఉధృతంగా ప్రవహించి వరద పరిస్థితులు ఏర్పడతాయి.
తీర కోత (Coastal Erosion): అధిక గాలులు, ఎగసిపడే అలల కారణంగా పూరీ, గోపాల్‌పూర్ వంటి ప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చి తీరం భారీగా కోతకు గురవుతుంది.
రవాణా-మౌలిక వసతులు: తీరప్రాంత రైలు మార్గాలు, జాతీయ రహదారులపై చెట్లు విరిగిపడటం, సిగ్నలింగ్ వ్యవస్థలకు అంతరాయం కలగడం వల్ల రాకపోకలు నిలిచిపోతాయి.

ముందస్తు భద్రతా చర్యలు-మార్గదర్శకాలు
మత్స్యకారులకు హెచ్చరికలు: సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధిస్తారు. సముద్రంలో ఉన్న పడవలను వెంటనే ఒడ్డుకు చేర్చాలి.
పునరావాస కేంద్రాలు: తుపాను షెల్టర్లను సిద్ధం చేసి, పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
కంట్రోల్ రూమ్‌లు: కలెక్టరేట్‌లు, తహశీల్దార్ కార్యాలయాల్లో 24/7 అత్యవసర సహాయ కేంద్రాలు (Helpline Centers) ఏర్పాటు చేస్తారు.

ఇంటి నుంచి రావ‌ద్దు! : సీఎం చంద్ర‌బాబు

అర్నబ్ తుఫాన్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం
• అర్నబ్ తుఫాన్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది
• ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తుఫాన్ సన్నద్ధతపై సమీక్ష చేస్తూనే ఉన్నాను
• ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా మేం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం
• ఆర్నబ్ తుపాను రెడ్ కేటగిరీలో ఉంది. అయినా ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు
• శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకూ తుఫాన్ ప్రభావం ఉంటుంది.
• పశ్చిమగోదావరి, కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకూ ఎక్కువ వర్షాలు, గాలుల తీవ్రత ఉంటుంది
• కాకినాడ సమీపంలోని యానాం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది.
• తుఫాన్ ప్రభావంతో వర్షాలు ఈ ఉదయం నుంచి ఉత్తరాంధ్రలో ప్రారంభమయ్యాయి
• ఇవాళ రాత్రికి, రేపు కూడా వర్షపాతం తీరప్రాంతాల్లో నమోదు అవుతుంది
• కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది
• కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
• శ్రీకాకుళంలో 30 సెంటీ మీటర్ల, పశ్చిమ గోదావరిలో 28, విశాఖ 23 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది
• చాలా చోట్ల 10 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు అవుతుంది
• తీర ప్రాంతజిల్లాల్లో సముద్రపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది
• లోతట్టు ప్రాంతాలు, తీరప్రాంత ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను
• సముద్ర తీరగ్రామాలు, లంకలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తుఫాన్ షెల్టర్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం
• ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. తుఫాన్ ప్రభావంతో ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు
• 290 షెల్టర్లను ఏర్పాటు చేశాం. 84,396 మందిని షెల్టర్లకు తరలించాం.
• రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు 24 గంటలూ పని చేస్తున్నాయి
• ప్రతి గంటకూ తుఫాన్ హెచ్చరికల బులెటిన్ జారీ చేస్తున్నాం. నిరంతరం తుఫాన్‌పై సమీక్షిస్తున్నాం
• తుఫాన్ తీవ్రత ఉండే ప్రాంతాలకే అప్రమత్తతా హెచ్చరికలు జారీ చేశాం.

• మత్స్యకారులకు చెందిన 30 వేల పైచిలుకు బోట్లను సముద్రం నుంచి వెనక్కు రప్పించాం
• గోపాల్ పూర్‌లో కూడా ఏపీకి చెందిన 93 బోట్లు వాటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారు
• వైద్య చికిత్సల కోసం 1,316 అంబులెన్సులు సిద్ధం చేశాం
• 5 వేల మంది గర్భిణులను ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సమీప ఆస్పత్రులకు తరలించాం
• సురక్షిత మైన తాగునీరు అందించేలా ట్యాంకర్లు, జనరేటర్లను సిద్ధం చేశాం
• విద్యుత్ అంతరాయం వస్తే తక్షణం స్పందించేందుకు 8,400 మందిని సిద్ధం చేసుకున్నాం
• తుపాను ప్రభావంతో 15 వేల వరకూ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం
• తుఫాను కారణంగా కురిసే భారీ వర్షాలకు నాగావళి, వంశధార నదులకు వరద వచ్చే అవకాశం ఉంది
• అలాగే వివిధ జిల్లాల్లో వాగులు వంకల్లో వరద నీటి ప్రవాహాలను అంచనా వేయటంతో పాటు చెరువులకు గండ్లు పడినా వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాం
• ముంపు గ్రామాల్లో ఆహారం, ఔషధాలు సరఫరా చేసేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నాం
• 7.16 లక్షల హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు, 16 లక్షల ఉద్యాన పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది
• అంగన్‌వాడీల నుంచి పిల్లలకు, బాలింతలకు, రేషన్ పంపించేలా కూడా ఏర్పాట్లు చేశాం
• క్యాచ్ మెంట్ ఏరియాలో పడే వర్షపు నీటిని రిజర్వాయర్లలో నింపేలా కూడా చర్యలు తీసుకున్నాం
• తుఫాను కారణంగా నష్ట ప్రభావాన్ని సాంకేతికత ఆధారంగా అంచనా వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాం
• ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను.
• గతంలో బుడమేరు వరద సమయంలో నేను విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించాను
• ప్రజలు దాదాపు రూ.5 వందల కోట్ల మేర విరాళాలు కూడా ఇచ్చారు.
• ప్రాణ, ఆస్తినష్టం వీలైనంత మేర తగ్గించటమే లక్ష్యంగా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం
• సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు మరింత సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను
• నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
• తీవ్ర తుపానుపై ఇవాళ రాత్రి కూడా నిరంతరం క్షేత్రస్థాయిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తాం
• హుద్ హుద్ కంటే తీవ్రత తక్కువ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాం
• ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, కోస్టుగార్డులను కూడా అప్రమత్తం చేశాం
• వీలైనంత మేర ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.

• ప్రజలంతా సురక్షితంగా ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం
• తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు తుపాను షెల్టర్లకు తరలి వెళ్లాలని కోరుతున్నాం
• గాలులు, భారీ వర్షాల కారణంగా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నాం
• గతంలో హుద్ హుద్ సమయంలో పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించాం
• రాష్ట్ర ప్రజలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది
• యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేలా నిరంతరం సమీక్ష చేస్తున్నాను.

Top Stories You Can See

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version