Home వార్తలు భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’

భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’

0

భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’

బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’.. భారీ పోస్ట్ థియేట్రికల్ మూవీ లైనప్‌లో భాగంగా ప్రకటించిన Z5 తెలుగు*

బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న‌ అత్యంత ఆసక్తికర భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’. ఈ చిత్రం Z5 తెలుగు భారీ పోస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ లైనప్‌లో చోటు దక్కించుకుంది. దైవత్వం యొక్క అద్భుతమైన శక్తిని ప్రతిబింబించే ఓ పవర్‌ఫుల్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆసక్తికరమైన క్రియేటివ్ కలయికగా నిలుస్తోంది. అల్లరి నరేష్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్ రవి కథను అందిస్తున్నారు. మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ ఎస్. థమన్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం.. ఇలా అన్ని అంశాల సమ్మేళనంగా రూపొందుతోన్న ‘కనకదుర్గ’ చిత్రం, సర్వశక్తిమంతమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్యశక్తి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నుంచి స్ఫూర్తి పొందింది. భక్తి భావాన్ని ఆవిష్కరిస్తూనే, నేటి ప్రేక్షకులకు ఆకట్టుకునే కథతో ఓ పవర్‌ఫుల్ సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘కనకదుర్గ’ చిత్రాన్ని బిర్లా స్టూడియోస్ సమర్ప‌ణ‌లో టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం ముందుగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై.. ఆ తర్వాత ప్రత్యేకంగా Z5 తెలుగులో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. (Story: భక్తి ప్రధాన చిత్రం ‘కనకదుర్గ’)

Top Stories You Can See

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version