Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దళితులపై వివక్ష..పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు!

దళితులపై వివక్ష..పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు!

0

దళితులపై వివక్ష..పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు!

పోలవరం సొసైటీలో వ్యవహారంపై చర్చ

న్యూస్‌తెలుగు/చాట్రాయి: దళితులపై వివక్షత చూపుతున్నారు … చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని వేధిస్తున్నారు… మనమంతా కలిసికట్టుగా మంత్రి వద్దకు వెళ్ళదామని చాట్రాయి మండల దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం చాట్రాయి మండల కేంద్రంలో మండలంలోని 18 గ్రామాలకు చెందిన వివిద పార్టీలు ప్రజా సంఘాలకు చెందిన దళిత సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సమావేశం ప్రారంభించారు. సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొమ్ము ఆనందం మాట్లాడుతూ. పోలవరం సొసైటీలో దళిత యువకుడిని సుదీర్ఘకాలంగా వారి అవసరాలకు వాడుకుంటూనే నచ్చకపోతే సరికి పోలీస్ స్టేషన్లో జరిగిన వ్యవహారంలో సొసైటీ ప్రసిడెంట్ పేరు ఏకవచనంతో ఉచ్చరించాడని , సొసైటీలో లక్షలాది రూపాయలు తినేశాడని ఒకసారి నిరాధారమైన ఆరోపణలతో ఉద్యోగం నుంచి తీసివేశారని పలానా నాయకుడు మాట వింటే మళ్ళీ పెడతారని మాట్లాడటం ఏమిటన్నారు. ఆయన కోసం అందరూ సమైక్య ఉద్యమం నిర్వహించాలన్నారు. సిపిఎంఎల్ లిబరేషన్ అనుబంధం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుర్గం పుల్లారావు మాట్లాడుతూ. అధికారాల మార్పిడి జరిగినప్పుడు గ్రామస్థాయిలో చిన్న చిన్న ఉద్యోగాలలో జీవనం సాగిస్తున్న దళితులను సునాయాసంగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల ప్రధాన కార్యదర్శి తేళ్ళూరి శేఖర్ మాట్లాడుతూ. ఎంతగా పని చేసినా ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోతున్నామని ఇటీవల ఒక విందులో ప్రైవేటు సంభాషణలో స్థానిక ఎన్నికల పోటీలలో ఎస్సీలు గెలవరు ఓసీలు, బీసీలు గెలుస్తారంటూ కొంత మంది మాట్లాడుతున్నారని అత్యదిక శాతంగా ఉన్న దళితులు ఓట్లు వేయకుండా ఎవరైనా ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. గ్రామాలలో ఉన్న దళితుల సమస్యలను అందరూ ఐక్యమత్యంగా మంత్రి వద్దకు వెళ్లి మన సమస్యలు పరిష్కరించుకుందామన్నారు.మంత్రి సామాన్యుల సమస్యల పరిష్కారికి శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. మనమే స్వయంగా వెళదామన్నారు. సమావేశంలో టిడిపి మండల ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గార్లపాటి మహేష్, నియోజకవర్గ నాయకులు నక్క రాము తేనేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. (Story: దళితులపై వివక్ష..పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు!)

Top Stories You Can See

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version