ఆహాలో సరికొత్త రియాలిటీ షో వచ్చేసింది!
‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో కోసం WPP మోషన్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఆహా
ఈ కార్యక్రమం గురించి WPP మీడియా సౌత్ ఏషియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ పద్మనాభన్ మాట్లాడుతూ – తెలుగు వారి అభిమాన ఓటీటీ ఆహాతో కలిసి ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో నిర్వహించడం సంతోషంగా ఉంది. కంటెంట్ క్రియేటర్స్ మన కల్చర్ ను ప్రతిబింబించే మాధ్యమాలుగా మారిపోయారు. తెలుగువారి కోసం మేము అందిస్తున్న సరికొత్త రియాలిటీ షో ఇది. సృజనాత్మకత, సాంకేతికత కలగలిసిన ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకాబోతున్నాం. అన్నారు.
అర్హా మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఓఓ రామ్‌శివ లింగా మాట్లాడుతూ – తెలుగు డిజిటల్ క్రియేటర్స్ ప్రతిభను చాటే కార్యక్రమం ఇది. దీన్ని మేమొక పోటీగా చూడటం లేదు. మన కంటెంట్ క్రియేటర్స్ ప్రతిభను ఆహా ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో వేదిక మీద సెలబ్రేట్ చేయబోతున్నాం. ఈతరం ప్రేక్షకులు కంటెంట్ ను ఎలా చూస్తున్నారో, ఎలా షేర్ చేసుకుంటున్నారో తెలియజేసే షో ఇది. అన్నారు. (Story: ఆహాలో సరికొత్త రియాలిటీ షో వచ్చేసింది!)
