అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని,రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఎద్దవా చేశారు. ఆరు గ్యారంటీలు 11డిక్లరేషన్లు అన్ని మోసమేనని భారతదేశ చరిత్రలో ప్రజలను ఇంత దగాపురితంగా మోసం చేసే బడ్జెట్ నేను చూడలేదని దుయ్యబట్టారు. ఎన్నికల డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క వాగ్దానం నిలుపుకోకుండా మహిళలను,వృద్ధులను, దివ్యాంగులను,విద్యార్థినులను,రైతులను,కార్మికులను,ఉపాధి కూలీలను,హరిజన,గిరిజన,బడుగు బలహీన,మైనార్టీ వర్గాలను మోసం చేసి చరిత్రలోకి ఎక్కిందని గౌరవ నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,గంధం.పరంజ్యోతి,గోపాల్ పేట మండల అధ్యక్షులు బాలరాజు, పెబ్బేరు మండలం అధ్యక్షులు వనం.రాములు,కర్రెస్వామి,నాయకులు ధర్మా నాయక్,దేవర్ల.నరసింహ,నాగన్న యాదవ్,నారాయణ నాయక్, జోహెబ్ హుస్సేన్, మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,వడ్డే. రమేష్ మంద.రాము,శంకర్ తదితరులు ఉన్నారు.(Story : అంకెల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం )

