ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను వైద్య మిత్ర రాష్ట్ర నాయకులు, పారామెడికల్ ఔట్సోర్సింగ్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను విన్న మంత్రి.. ఆ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వేతనాల పెంపు, సంక్షేమ పథకాలు వర్తించే విధంగా మాట్లాడుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్య మిత్ర రాష్ట్ర దళిత గిరిజన ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి, పారామెడికల్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్, వైస్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి, జనరల్ సెక్రెటరీ కిరణ్ కుమార్, పల్నాడు అసోసియేషన్ వైద్య మిత్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన పారామెడికల్ ఔట్సోర్సింగ్ నాయకులు పాల్గొన్నారు.(Story : ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి )
