మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
న్యూస్ తెలుగు/వినుకొండ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. మహిళల అభ్యున్నతికి, సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తు పాలన సాగిస్తుందన్నారు. సృష్టికి మూలం, జగతికి ఆధారం, వాళ్ళు అలుపెరగని శ్రమ తత్వంతో పనిచేస్తున్న నారీ శక్తికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.(Story : మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )
