Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడులు: ముగ్గురి అరెస్ట్

వినుకొండ లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడులు: ముగ్గురి అరెస్ట్

0

వినుకొండ లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడులు: ముగ్గురి అరెస్ట్

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణంలోని లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పట్టణ సీఐ బి. ప్రభాకర్, ఎస్సై పుల్లారావు తమ సిబ్బందితో కలిసి స్థానిక లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక మహిళతో పాటు ఇద్దరు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా పట్టణంలోని లాడ్జి యజమానులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. లాడ్జీలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి లాడ్జీలలో అసాంఘిక కార్యక్రమాలకు తావిస్తే, యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.(Story : వినుకొండ లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడులు: ముగ్గురి అరెస్ట్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version