Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జేఈఈ మెయిన్స్-2026 ఫస్ట్ సెషన్‌లో విశ్వ సాయి విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్స్-2026 ఫస్ట్ సెషన్‌లో విశ్వ సాయి విద్యార్థుల ప్రతిభ

జేఈఈ మెయిన్స్-2026 ఫస్ట్ సెషన్‌లో విశ్వ సాయి విద్యార్థుల ప్రతిభ

న్యూస్ తెలుగు/వినుకొండ  : ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్-2026 మొదటి సెషన్ ఫలితాల్లో వినుకొండకు చెందిన విశ్వ సాయి కళాశాల విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీవల్లి పావని తెలిపారు. కళాశాల నుంచి మొత్తం 47 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 70 % కు పైగా సాధించిన వారు 25 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎస్.కే భాష 95.08 పర్సంటైల్‌తో ప్రథమ స్థానం, పి.వి ప్రశాంత్ కుమార్ 92.35 పర్సంటైల్‌తో ద్వితీయ స్థానం, కే. స్వర్ణమాస రెడ్డి 91.30 పర్సంటైల్‌తో తృతీయ స్థానం సాధించి ప్రతిభ చాటినట్లు తెలిపారు. రానున్న రెండో సెషన్‌లో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలుపుతూ, తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.(Story : జేఈఈ మెయిన్స్-2026 ఫస్ట్ సెషన్‌లో విశ్వ సాయి విద్యార్థుల ప్రతిభ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!