Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో వినుకొండ విద్యార్థినుల భరతనాట్యం ఆకట్టుకుంది

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో వినుకొండ విద్యార్థినుల భరతనాట్యం ఆకట్టుకుంది

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో వినుకొండ విద్యార్థినుల భరతనాట్యం ఆకట్టుకుంది

న్యూస్ తెలుగు/వినుకొండ  : మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో వినుకొండకు చెందిన శ్రీలక్ష్మి నృత్య కళాశాల విద్యార్థినులు భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించారు. దేవస్థానం ఆహ్వానం మేరకు ఆలయ సాంస్కృతిక వేదికపై కళాశాల డైరెక్టర్ శ్రీమతి గాలి రేవతి దేవి శిష్యబృందం సభ్యులు మనస్విని, వైష్ణవి, ఆశ్రీత, సుహాసిని సాంప్రదాయ శైలిలో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వారు “హిమగిరి తనయే”, “ఎందరో మహానుభావులు”, “బాలగోపాల తరంగం” వంటి ప్రసిద్ధ త్యాగరాయ కృతులు, తరంగాలు, కీర్తనలను నృత్య రూపంలో ఆవిష్కరించి సభికులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ వ్యవహరించారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యుడు శ్రీ దండి రాఘవయ్య విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేసి, కళాశాల డైరెక్టర్ గాలి రేవతి దేవిని ఘనంగా సత్కరించారు.(Story : శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో వినుకొండ విద్యార్థినుల భరతనాట్యం ఆకట్టుకుంది )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!