Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రజలకు – ప్రభుత్వానికి వారధిగా పార్టీ నాయకులు పనిచేయాలి

ప్రజలకు – ప్రభుత్వానికి వారధిగా పార్టీ నాయకులు పనిచేయాలి

ప్రజలకు – ప్రభుత్వానికి వారధిగా పార్టీ నాయకులు పనిచేయాలి

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుల శిక్షణ…

అరకు పార్లమెంట్‌తో ప్రత్యేక సమావేశం…

న్యూస్ తెలుగు/వినుకొండ : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షులు – పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు, పరిశీలకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, నియోజకవర్గాల వారీగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే బాధ్యతను పార్టీ నాయకులు, పరిశీలకులు సమన్వయంతో నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ లక్ష్యాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేయాలని తెలిపారు. పార్టీ విజయంలో ప్రతి కార్యకర్త, నాయకుడి పాత్ర కీలకమని చీఫ్ విప్ స్పష్టం చేశారు.(Story : ప్రజలకు – ప్రభుత్వానికి వారధిగా పార్టీ నాయకులు పనిచేయాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!