Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రైతు బాంధవుడు ముప్పాళ్ళ చెన్నయ్య 10వ వర్ధంతి సందర్భంగా నిరాశ్రయులకు దుప్పట్లు, భోజనం అందచేత

రైతు బాంధవుడు ముప్పాళ్ళ చెన్నయ్య 10వ వర్ధంతి సందర్భంగా నిరాశ్రయులకు దుప్పట్లు, భోజనం అందచేత

రైతు బాంధవుడు ముప్పాళ్ళ చెన్నయ్య 10వ వర్ధంతి సందర్భంగా నిరాశ్రయులకు దుప్పట్లు, భోజనం అందచేత

న్యూస్ తెలుగు/వినుకొండ: ప్రముఖ సంఘ సేవకులు, అడ్వకేట్, వినుకొండ ఏజిపి ముప్పాళ్ళ జ్ఞానేశ్వర రావు తండ్రి ముప్పాళ్ళ చెన్నయ్య 10వ వర్ధంతిని పురస్కరించుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని నిరాశ్రయులకు మరియు నిరుపేదలకు భారీ ఎత్తున దుప్పట్లు మరియు భోజనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర రావు, ఈ ఏడాది 10వ వర్ధంతిని పురస్కరించుకుని చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్డు పక్కన నివసించే అభాగ్యులకు నాణ్యమైన దుప్పట్లను, ఆకలితో వున్నవారికి ఫౌండేషన్ సభ్యులతో కలిసి స్వయంగా భోజనం పంపిణి చేసారు. తన తండ్రి నేర్పిన సేవా దృక్పథమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. వారి జ్ఞాపకార్థం నలుగురికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యుల సహకారం ఈ కార్యక్రమ విజయానికి ఎంతో తోడ్పడింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పమిడిపల్లి అనిల్ రాజ్, ఉపాధ్యక్షులు గుమ్మడి మనోహర్, జాయింట్ సెక్రెటరీ పెనుమాల వెంకట్రావు, ట్రెజరర్ కే. సునీల్, తదితరులు పాల్గొన్నారు.(Story : రైతు బాంధవుడు ముప్పాళ్ళ చెన్నయ్య 10వ వర్ధంతి సందర్భంగా నిరాశ్రయులకు దుప్పట్లు, భోజనం అందచేత )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!