ఓటు హక్కు ఎంతో విలువైనది. ఏపీ ఓ రామ తులసి
న్యూస్ తెలుగు /చింతూరు : ప్రజాస్వామ్యం లో ఓటు ఎంతో విలువైనదని, 18 సం నిండిన ప్రతీవారు ఓటుహక్కు ను వినియోగించు కోవాలని ఏపీవో రామ తులసి పేర్కొన్నారు.చింతూరులో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఎర్రం పేటలోని ఐటిడిఏ కార్యాలయం నుంచి చింతూరు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సందర్భంగా ఏపీవో రామతులసి మాట్లాడుతూ ఓటు వేయటం కేవలం హక్కు మాత్రమే కాదని, అది ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం లో పాలకులను ఎన్నుకొనే అధికారం ప్రజలకు వుంటుందని, ఈ అధికారాన్ని ప్రసాదించే ఆయుధమే ఓటు అని, దేశ భవిష్యత్తు ను నిర్ణయించే ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించటానికి జాతీయ ఓటర్ల దినోత్సవం దోహద పడుతుందని అన్నారు. భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25 న ఏర్పాటయిందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 2011 నుండి ప్రతీ సంవత్సరం జనవరి 25 ను జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ సమావేశాన్ని తాసిల్దార్ సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు గా నమోదు చేసుకొని విధిగా ఆ హక్కును విచక్షణతో వినియోగించుకోవాలని కోరారు. సరైన నాయకుడ్ని ఎన్నుకొంటేనే అభివృద్ధి సాధ్యమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డిగ్రీ కాలేజ్ ఆవరణంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు, ముగ్గుల పోటీలు, వ్యాసరచన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఓటు హక్కు పై ఉన్న లోగో సర్టిఫికెట్లను బహుక రించారు. అనంతరం ఉపాధ్యాయులు, చింతూరు పౌరులు, విద్యార్థులు, తదితర రెవెన్యూ సిబ్బంది, ‘ప్రజాస్వామ్యం పై నిశ్చలమైన విశ్వాసం తో ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటును సరైన నాయకుడ్ని ఎన్నుకొనేందుకు విధిగా ఉపయోగించుకుంటామని’ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో , తదితర ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story : ఓటు హక్కు ఎంతో విలువైనది. ఏపీ ఓ రామ తులసి )