బ్యాంకు ఉద్యోగులు సమ్మె
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ కొత్తపేట నందు వినుకొండ ఐదు మండలాలకు చెందిన ఆల్ ఎంప్లాయిస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఒకరోజు సమ్మెలో భాగంగా బ్యాంకు వద్ద నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ. వారానికి ఐదు రోజులు పని దినాలు అమలకై డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నేడు సమ్మెకు దిగామన్నారు. ఇటీవల చీప్ లేబర్ కమిషనర్ తో జరిగిన చర్చలు విఫలం అవడంతో యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చిందని, దీంతో ఎస్ బి ఐ, యూనియన్ తదితర బ్యాంకుల సేవల్లో అంతరాయం మరియు ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నామని వారు తెలిపారు. ఒకరోజు సమ్మె కార్యక్రమంలో పాల్గొన్న ఐదు మండలాలకు చెందిన సిబ్బంది వినుకొండ మెయిన్ బ్రాంచ్ పవన్ కుమార్, నాగరాజు నాయక్ , ఏ డి బి బ్యాంకు చెందిన పి వెంకట్రావు, బి బాలరాజు, టి వెంకీ రెడ్డి, నూజెండ్ల బ్రాంచ్ కి చెందిన సి హెచ్ అంకయ్య, ఎన్ సాంబయ్య, శావల్యాపురం బ్రాంచ్ పి శ్రీహరి, ప్రశాంతి గుమ్మనపాడు బ్రాంచ్ జి భానుచందర్, వేల్పూరు బ్రాంచి కె వీ బ్రహ్మయ్య, తదితర సిబ్బంది పాల్గొని నిరసన తెలిపారు. (Story:బ్యాంకు ఉద్యోగులు సమ్మె)
