విద్యార్థులు నైతిక విలువలతో ముందుకు నడవాలి
నీతి, నిజాయితీ, ధర్మాన్ని పాటించే వాళ్లు రియల్ హీరోలు
రైజ్ ఇండియా విజన్ 2047లో విద్యార్థుల పాత్ర కీలకం
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రతి విద్యార్థి నైతిక విలువలు అలవర్చుకొని దేశభక్తితో ముందుకు నడవాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగిన రైజ్ ఇండియా విజన్ 2047 కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు దేశభక్తితో విద్యలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించి వికసిక్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ 2047 దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నీతి, నిజాయితీ, దయ, ధర్మం, బాధ్యత, గౌరవం వంటి విలువలను అలవర్చుకొని ముందుకు సాగే వారే జీవితంలో రియల్ హీరోలని వివరించారు. విద్యార్థులను మంచి పౌరులుగా, సమాజానికి సేవ చేసే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అలవర్చుకునే విధంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి నూతన టెక్నాలజీలతో నైపుణ్యాలను సంపాదించి ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతి విద్యార్థి అర్థం చేసుకొని దేశాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. నైతిక విలువలతో విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రతి ఒక్కరూ భావి భారత పౌరులుగా ఎదగాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు,అధికారులు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. (Story:విద్యార్థులు నైతిక విలువలతో ముందుకు నడవాలి)
