Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు…

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు…

0

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు…

ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…..

ప్రథమ చికిత్స అనంతరం ఆదివారం ఎక్స్రే ఆపరేటర్ రాడంటూ క్షతగాత్రున్ని ప్రైవేట్ ఆసుపత్రికి పంపివేసిన డాక్టర్లు….

న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండల పరిధిలోని చీకటిగల పాలెం చెక్ పోస్ట్ సెంటర్లో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన భీమనాదం కోటేశ్వరరావు, చీకటిగల పాలెం జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు దాటే క్రమంలో వినుకొండ ఆర్టిసి డిపో కి చెందిన ఏపీ 29 జెడ్ 1731 నెంబర్ పల్లె వెలుగు బస్సు పొదిలి నుండి వినుకొండ వచ్చే క్రమంలో కోటేశ్వరావుని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన కోటేశ్వరరావు ను 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది క్షత గాత్రుడికి ప్రధమ చికిత్స చేసి కుట్లు వేసి కట్టు కట్టారు. అయితే కుడి కాలు కింద భాగం లోతుగా దెబ్బతినడంతో ఎక్స్రే తీసేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే తీయరా, కొందరు అడగ్గా, ఆదివారం ఎక్స్రే ఆపరేటర్ రాడు, అందువల్ల బయటకు తీసుకు వెళ్ళండి అని వైద్య సిబ్బంది సమాధానం ఇచ్చారు. అయితే అప్పటికే ఒకరిద్దరూ ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన అంబులెన్స్ డ్రైవర్లు అక్కడ వేచి ఉండి క్షతగాత్రున్ని తమ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పట్టణ పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రుడు కోటేశ్వరావు నుండి ఆర్టీసీ బస్సు డ్రైవర్ కె.వి స్వామి నుండి వివరాలు సేకరించారు. కాగా ఇటీవల వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించినందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చాయంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసి చీఫ్ గెస్ట్ గా చీప్ విప్, స్థానిక శాసనసభ్యు లను ఆహ్వానించారు. దీంతో వారు వైద్యులను ప్రశంసలతో ముంచెత్తి ప్రభుత్వ పనితీరును కొనియాడుకున్నారు.(Story : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు… )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version