ఆదివాసి ఇంటి నిర్మాణానికి జేకే సిటీ ట్రస్ట్ చైర్మన్ నిర్మాణ సామాగ్రి వితరణ
న్యూస్ తెలుగు /చింతూరు : పోలవరం జిల్లాలోని చింతూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన కుటుంబానికి ఇంటి నిర్మాణ సామాగ్రిని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ పైపులు సిమెంట్ రేకులను శనివారం అందజేశారు. నిరుపేద కుటుంబం అయినా సోడే వీరయ్య కు ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా ఇల్లు నిర్మించుకునేందుకు వీలు పడకపోవడంతో జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ కు తనకు ఇంటి నిర్మాణానికి సహకరించాలని అభ్యర్థించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి ఇంటి నిర్మాణానికి కావలసిన సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెకె సిటీ ట్రస్ట్ సభ్యులు జాన్ సుందర్,అజీజ్,వినోద్. టిడిపి నాయకులు తమన్న దొర. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు పసుపులేటి సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.(Story : ఆదివాసి ఇంటి నిర్మాణానికి జేకే సిటీ ట్రస్ట్ చైర్మన్ నిర్మాణ సామాగ్రి వితరణ )

