Homeవార్తలుతెలంగాణఅక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ఒక ముద్దాయి అరెస్టు

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ఒక ముద్దాయి అరెస్టు

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ఒక ముద్దాయి అరెస్టు

న్యూస్ తెలుగు /చింతూరు :పోలవరం జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై కొనసాగుతున్న దాడులు ఒడిశా రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న ఆరు కేజీల గంజాయి ని చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే పోలవరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గత కొద్ది కాలంగా గంజాయి అక్రమ రవాణా ను అరికట్టేందుకు చాకచక్యమైన చర్యలు చేపట్టి ఏజెన్సీలోనే అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట రాత్రి పగలు వాహనాల తనకి చేస్తున్నారు. దీనివల్ల కొన్ని రోజులుగా గంజాయి అక్రమ రవాణా తగ్గింది. అయినప్పటికీ గంజాయి తరలించడానికి అనేకమార్గాలని ఎంచుకున్న రవాణా దారులు పైలెట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చెకింగ్ చేసే పోలీసులు కళ్ళుగప్పి గంజాయి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీల నిర్వహణ ఆత్మకంగా చేపట్టిన నేపథ్యంలో శనివారం చింతూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఎ ఎస్పి బొడ్డు హేమంత్ పర్యవేక్షణలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో 6 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దాని విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఒరిస్సా రాష్ట్రం నుండి కర్నూలు జిల్లాకు తరలిస్తుండగా స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో కర్నూలు జిల్లా కల్లూరు మండలం బి క్యాంపు కు చెందిన పశుపల జగన్నాథ్ ను అరెస్ట్ చేశామని యస్,ఐ తెలిపారు అలాగే అతని వద్దనున్న ఆండ్రాయిడ్ ఫోన్ను, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకొని, రిమాండ్ నిమిత్తం రంపచోడవరం కోర్టు లో హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు.(Story : అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ఒక ముద్దాయి అరెస్టు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!