ఘనంగా గీతాంజలి రెసిడెన్సీయల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం కారంపూడి రోడ్ లోని గీతాంజలి గ్రౌండ్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, ప్రముఖ సినీ నటుడు, హాస్య బ్రహ్మ, పద్మశ్రీ అవార్డు గ్రహీత కె. బ్రహ్మానందం ముఖ్య అతిధులు గా విచ్చేసి చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా శైలజ మాట్లాడుతూ. 25 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసివుంటారు అని, అయినా ఈ స్థాయికి రావడం అభినందనీయమని అన్నారు. అలాగే ఈ ప్రాంతం వారు అందరూ రైతు కుటుంబాలు కనుక కష్టపడి చదివి మంచి స్థితికి రావాలి అని కోరారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ. పేదరికం నుండి వచ్చిన నేను కస్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను అని, కావున చదువును నమ్ముకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని పిలుపునిచ్చారు. గీతాంజలి వ్యవస్థాపకులు యేండ్లూరి శేషగిరి రావు మాట్లాడుతూ. స్కూల్ ప్రారంభించిన నాటి నుండి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండంట్ కిషోర్, ప్రిన్సిపాల్ తేళ్ళ కృష్ణవేణి, డి. ఈ. ఓ పి. రామారావు, నవీన విద్యా సంస్థల డైరెక్టర్ వై. చిన్నపరెడ్డి, చైతన్య విద్యా సంస్థల ఏ జి ఎం దుర్గా ప్రసాదు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : ఘనంగా గీతాంజలి రెసిడెన్సీయల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు )

