గీతమ్స్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు..
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక సిద్ధార్థ నగర్ లోని గీతమ్స్ హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాలపాటి కోటిరెడ్డి మాట్లాడుతూ. ముఖ్యమైన పండగలలో మూడు రోజుల పాటు జరుపుకునే భోగి, మకర సంక్రాంతి, కనుమ ముఖ్యమైనవని అన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో వారికి అర్థమయ్యే విధంగా సాంప్రదాయ వస్త్రధారణతో, హరిదాసు వేషధారణ, గంగిరెడ్లు, చెరుకు గడలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లికలతో తెలుగుదనం ఉట్టిపడే విధంగా పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థినిలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ మరియు కన్సోలేషన్ బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ విద్యార్థిని, విద్యార్థులు , ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.(Story : గీతమ్స్ లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు.. )

