చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
న్యూస్ తెలుగు/ చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నుండి శుక్రవారం వరకు ముందస్తు సంక్రాతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. కె.రత్న మాణిక్యం తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ముగ్గుల పోటీలు, నృత్య ప్రదర్శన, సాంప్రదాయ అలంకరణ పోటీలు, పాటల పోటీలు,100మీ,400మీ పరుగు పందెం, ఖో -ఖో, కబడ్డీ,వాలీబాల్, త్రో బాల్ పోటీలు నిర్వహించి,గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.సంప్రదాయ వంటకాల ఫుడ్ స్టాల్స్ ను విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేశారు.అనంతరం కళాశాల ఆవరణంలో భోగి మంటలు వేసి సంక్రాంతి పాటలు పాడుతూ విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కల్చరల్ కోఆర్డినేటర్ జి హారతి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎమ్ శేఖర్, అధ్యాపకులు జి. వెంకట్రావు, డా.వై పద్మ, డా.కె.శకుంతల,ఎస్. అప్పనమ్మ,కె.శైలజ,ఎమ్.నాగమోహన్,జి. సాయికుమార్,ఆర్ మౌనిక,బి. శ్రీనివాసరావు,ఎన్.ఆనంద్,కె ఎల్. లక్ష్మి ప్రసన్న,ఆర్. కిరణ్మయి,కె. కీర్తి, ఎన్. వి. వి. ఎస్ మూర్తి, సంగం నాయుడు మరియు అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.(Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు )

