Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కన్నుల పండుగగా దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం

కన్నుల పండుగగా దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం

కన్నుల పండుగగా దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం

న్యూస్ తెలుగు / వినుకొండ : శ్రీ గంగా పార్వతి సమేత, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం స్థానిక వినుకొండ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ లోని శ్రీ వాసవి కల్యాణ మండపం నందు కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఆత్మీయ అతిధులుగా జి. డి. సి. సి బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. ముందుగా శాసన సభ్యులు జీవి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా అచ్యుత కోటేశ్వరరావు, సెక్రటరీ భవనాసి శివ రమేష్ బాబు, ట్రెజరర్ పొత్తూరి రవీంద్ర కుమార్, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్సులు, కార్యవర్గ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ. కొండమీద రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం కోసం అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ సభ్యులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి త్వరగా దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. దేవాలయ అభివృద్ధి నిర్మాణం నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి 4 కోట్ల రూపాయలు నిధులుఇప్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా 4 కోట్ల రూపాయలు నిధులను తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అదేవిధంగా ఆలయ నిర్మాణం నిమిత్తం తన వంతుగా 33 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అందులో భాగంగా మొదటగా 11 లక్షల రూపాయలను కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు కి అందజేశారు. శాసన సభ్యులు కి కమిటీ సభ్యులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఎంతో ముఖ్యమైన గొప్ప దేవస్థానం యొక్క ఆలయ నిర్మాణం బాధ్యతను తనపై ఉంచినందుకు అలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులందరూ కూడా మా బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంచి పేరు తెచ్చే విధంగా దేవాలయం నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. అసలు కొండమీదకి రోడ్డు వేయాలని సంకల్పం చేసి ఒక కమిటీ వేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిటీ వారికి ముందుగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఇప్పటివరకు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. నూతన కమిటీ కూడా చక్కగా వారి బాధ్యతలను నిర్వహించి దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా పనిచేయాలని సూచించారు. అనంతరం జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావు లను ఘనంగా సన్మానించి ,మెమొంటోలు అందజేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొంజేటి నాగ శ్రీను రాయల్, నిశ్శంకర శ్రీనివాసరావు మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ షకీల దస్తగిరి, బిజెపి నాయకులు, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీ కి అభినందనలు తెలిపారు. (Story:కన్నుల పండుగగా దేవస్థాన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!