Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌జాలలపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా చీరలు–పంచలు పంపిణీ..

జాలలపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా చీరలు–పంచలు పంపిణీ..

జాలలపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా చీరలు–పంచలు పంపిణీ..

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గంలోని జాలలపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని గ్రామంలోని ఆడపడుచులు, అన్నదమ్ములకు చీరలు మరియు పంచలు పంపిణీ కార్యక్రమాన్ని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంకాయలపాటి నాగేశ్వరావు, గొట్టం గోవిందరాజులు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన బ్రహ్మనాయుడు కి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికి, ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా గ్రామంలోని ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అణగారిన వర్గాలు మరింత అణగారిన పోతున్నారని, వైసీపీ పాలనలో క్రింది స్థాయి నుండి అన్ని వర్గాల కుటుంబాలకు ప్రతినెల ఆర్థిక సహకారం ఇస్తూ వచ్చారన్నారు. నేడు ఆ సంక్షేమ పథకాలన్నీ కనుమరుగవుతున్నాయి అన్నారు. అలాగే ఆనాడు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు వల్ల అన్ని వర్గాల ప్రజలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు జరిగాయని, నేడు ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. తొలుతగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి , రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వెంకటరామిరెడ్డి, జడ్పిటిసి సురాబత్తిని రాజేశ్వరరావు, మండల కన్వీనర్ దండు చెన్నయ్య, బొల్లాపల్లి మండల కన్వీనర్ కాకర్ల నారాయణ రెడ్డి, ఈపూరు మండల కన్వీనర్ నాగేశ్వరరావు , నూజెండ్ల మండల ముప్పరాజు వెంకటేశ్వర్లు, రామ తులసి రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(Story :; జాలలపాలెం గ్రామంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా చీరలు–పంచలు పంపిణీ.. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!