ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు…
+న్యూస్ తెలుగు/వినుకొండ : క్రిస్టియన్ అడ్వకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బార్ అసోసియేషన్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ ఇంచార్జ్ జడ్జి ఆర్ ఆశీర్వాదం పాల్ విచ్చేశారు. న్యాయమూర్తి ఆర్ ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ. క్రిస్మస్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ యేసు క్రీస్తు యొక్క ప్రేమ, దయ, కరుణ ఆయన మార్గలాను గురించి సందేశం ఇచ్చారు. క్రీస్తు యొక్క జీవన మార్గం అందరూ పాటించి వారి జీవితాల్లో సుఖసంతోషాలు పొందాలని ఆకాంక్షించారు. సీనియర్ న్యాయవాదులు క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు. సభ అధ్యక్షులు పిజె లూకా మాట్లాడుతూ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని అన్నారు. సీనియర్ న్యాయవాదులు క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏం శ్రీనివాసరావు, కార్యదర్శి పి గౌస్ మొహిద్దిన్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ పీవీ రమణారెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎన్ శేఖర్ బాబు, ట్రెజరర్ వి శివ శంకర్ బాబు, సీనియర్ న్యాయవాదులు పి సైదారావు, ఎలవర్తి శ్రీనివాసరావు, ముప్పాళ్ళ జ్ఞానేశ్వర్ రావు, చాగంటి వీరాంజనేయ చౌదరి, సిహెచ్ వెంకీ రెడ్డి, ఎన్ రామకోటేశ్వరరావు, ఆరే సామ్రాజ్యం, జెట్టి తిరుపతిరావు , న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.(Story : ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు…)
