Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విశ్వ సాయి జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం

విశ్వ సాయి జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం

0

విశ్వ సాయి జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం

న్యూస్ తెలుగు/వినుకొండ : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత గణితానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల మేథమెటిక్స్ విభాగ అధ్యాపక బృందాన్ని సన్మానించడం జరిగింది.గణితం అంటే భయపడే విషయం కాదు,గణితం అంటే ఆలోచించే శక్తి,గణితం అంటే సమస్యను ఎదుర్కొనే ధైర్యం.మన రోజువారీ జీవితంలో గణితం లేకుండా ఒక్క అడుగూ ముందుకు వేయలేం. సమయం, డబ్బు, సాంకేతికత—అన్నిటికీ ఆధారం గణితమే. మొబైల్ ఫోన్ నుండి అంతరిక్ష పరిశోధన వరకూ ప్రతిదీ గణితంపై నిలబడింది అన్నారు. రామానుజన్ మనకు నేర్పిన గొప్ప పాఠం ప్రతిభకు వనరులు అవసరం కాదు, నమ్మకం మరియు సాధన చాలు. కాబట్టి విద్యార్థులారా గణితాన్ని భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడండి. గణితం మన భవిష్యత్తుకు దారి చూపే దీపం. ఈ గణిత దినోత్సవం సందర్భంగా మనం ఒక మాట గుర్తుపెట్టుకుందాం గణితం నేర్చుకుంటే, జీవితం లెక్కలో పడుతుంది అని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపాల్ శ్రీమతి యడవల్లి శ్రీవల్లి పావనీలు అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకు బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సీనియర్ మ్యాథమెటిక్స్ అధ్యాపకులు కాకునూరి శ్రీనివాసరావు, పగిడిపల్లి నాగ శేషు, కమ్మ ప్రసాద్, సి.హెచ్. భారతి, కుమారి షేక్ హఫీజాలను సన్మానించారు.(Story :విశ్వ సాయి జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version