Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌చీప్ విప్ జీవిని కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి

చీప్ విప్ జీవిని కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి

చీప్ విప్ జీవిని కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ను పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా ని విద్యారంగంలో అగ్రగామిగా నిలపాలని, 10వ తరగతి ఫలితాలలో జిల్లాలో ప్రధమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు భారీ మొత్తంలో నగదు బహుమతులు, సదర పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల విషయంలో భారీగా నిధులు సమకూరుస్తానని, ఈ విధంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని పలు సూచనలు చేశారు. డీఈఓ ప్రతిస్పందిస్తూ ఉపాధ్యాయులతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనలు ప్రకారం పటిష్టమైన ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరావు, పల్నాడు జిల్లా అధ్యక్షులు పోలవరపు మరియ రాజు,రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ గద్దె రామకోటేశ్వరరావు, ఎన్ టి ఏ సీనియర్ నాయకులు నెట్టెం రాజా చౌదరి, ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్, ఎన్ టి ఏ నరసరావుపేట మండల అధ్యక్షులు జె. ఆనంద్ కుమార్, బొల్లాపల్లి మండల కార్యదర్శి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.(Story : చీప్ విప్ జీవిని కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!