Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌టిట్కో గృహాలు పూర్తి చేసి వినుకొండ లబ్ధిదారులకు అందించాలి 

టిట్కో గృహాలు పూర్తి చేసి వినుకొండ లబ్ధిదారులకు అందించాలి 

టిట్కో గృహాలు పూర్తి చేసి వినుకొండ లబ్ధిదారులకు అందించాలి 

సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము

న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక శివయ్య భవనంలో ఉదయం 11 గంటలకు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కొండ్రముట్ల సుభాని అధ్యక్షతన, పత్రిక విలేకరుల సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వినుకొండ సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము పాల్గొని మాట్లాడుతూ. 2014 సంవత్సరంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలని సంకల్పంతో రాష్ట్రంలో టీట్కో గృహాలను కట్టించే భాగంలో వినుకొండ పట్టణంలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి వారిచేత ప్రభుత్వానికి సింగల్ బెడ్ రూమ్ కి ఇంత డబల్ బెడ్ రూమ్ కి ఎంత కట్టాలని చెప్పగా 500 నుండి 50 వేల వరకు లబ్ధిదారులు డబ్బులు విడతలవారీగా కట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా 60% పైగా కట్టడాలను పూర్తి చేయటం జరిగింది. అయితే 2019 సంవత్సరంలో ఎన్నికలు జరగటం టిడిపి పార్టీ అధికారం కోల్పోయి వైసిపి పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి ఎన్నిసార్లు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లబ్ధిదారుల పక్షాన వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు. మరల 2024 సంవత్సరంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పటికీ రెండేళ్లు అవుతుంది. చిలకలూరిపేట, నరసరావుపేట అనేక ప్రాంతాల్లో టీట్కో గృహాలు అందించడం జరిగిందని, లబ్ధిదారులు ఆ గృహాల్లో నివాసం ఉంటున్నారని, వెంటనే వినుకొండ పట్టణంలో టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందించాలని రేపు ఉదయం 10 గంటలకు వినుకొండ మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం కమిషనర్ కి వినతి పత్రాన్ని ఇస్తున్నామని, ఉదయం 8 గంటలకు సిపిఐ కార్యాలయం వద్దకు లబ్ధిదారులు రావాలని అనంతరం, మున్సిపాలిటీ కార్యాలయం వరకు కలిసి వెళ్దామని లబ్ధిదారులకు రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వినుకొండ పట్టణ సహాయ కార్యదర్శి సుభాని, సిపిఐ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, సిపిఐ సీనియర్ నాయకులు పటాన్ లాల్ ఖాన్, సిపిఐ నాయకులు మహంకాళి సుబ్బారావు, షేక్ కిషోర్, శావల్యాపురం మండలం కార్యదర్శి రాయబారం వందనం, వినుకొండ రూరల్ మండల కార్యదర్శి కొప్పరపు మల్లికార్జునరావు, తదితరులు నాయకులు పాల్గొన్నారు.(Story :టిట్కో గృహాలు పూర్తి చేసి వినుకొండ లబ్ధిదారులకు అందించాలి  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!