ఓటమి భయంతో కొందరు నాయకులు చిల్లర రాజకీయలు చేస్తున్నారు
కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లతో చీకటి ఒప్పందాలకు పాల్పడుతూ నిస్సిగ్గుగా ఫోటోలు దిగుతున్నారు
అలాంటి సన్నాసులు నీతులు వల్లించడం సిగ్గుచేటు
గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది
న్యూస్ తెలుగు/వనపర్తి : మూడవ విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు పాల్గొని ప్రచారం చేసిన వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి రెడ్డి గారు
కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులతో కొందరు సన్నాసులు చీకటి ఒప్పందాలకు పాల్పడుతూ ఫోటోలు దిగుతూ ప్రజల ముందు నిస్సిగ్గుగా నీతులు వల్లిస్తున్నారని ఇలాంటి రాజకీయ వ్యభిచారానికి పాల్పడి నాయకులను ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు
సోమవారం పెబ్బేరు మండలంలోని రంగాపురం, జనంపల్లి, బూడిదపాడు, పాతసుగుర్, కొత్త సూగూరు, యాపర్ల , గుమ్మడం, గుమ్మడంతాండ, అయ్యవారిపల్లి, పాత పల్లి, గ్రామాలలో ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారం చేపట్టారు
ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు
గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాల మధ్యన నృత్యాలు చేస్తూ పూల వర్షం కురిపించారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో నాయకులుగా చలామణి అయ్యే కొందరు చీకటి ఒప్పందాలకు పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారానికి తెర లేపారని ఆయన అన్నారు
కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ లబ్ధి కోసం
కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొనే వారిని దగ్గరకు కూడా రానివ్వకూడదన్న మాటలను
కొందరు సన్నాసులు వక్రీకరించి శునకానందం పొందుతున్నారని ఆయన అన్నారు
ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసిన నీచ రాజకీయాలు చేసిన గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉందని నేడు సర్పంచులుగా నిలబడిన అభ్యర్థులు ఎవరు అధైర్య పడకూడదని అంతిమంగా మనమే విజయం సాధిస్తామని ఆయన అన్నారు
ఇందిరమ్మ ఇండ్లు
రేషన్ కార్డులు
ఉచిత కరెంటు
ఉచిత ఆర్టీసీ బస్సు
మహిళలకు వడ్డీ లేని రుణాలు
సన్న బియ్యం పంపిణీ
ఉన్నత విద్య
మెరుగైన వైద్యం అందిస్తూ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని రానున్న మూడు సంవత్సరాలలో గ్రామాలన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిస్తే గ్రామాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయన్నారు
10 సంవత్సరాల BRS పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని అలాంటి పాలన అందించిన నాయకులు నేడు నీతులు మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నీతి మాలిన తనం అన్నారు
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాలు కొద్దిగా అటు ఇటు ఉన్న గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకే అధిక ఓట్లు పోలయ్యాయి అనేది గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు
మూడు సంవత్సరాలు మరో 10 సంవత్సరాలు మొత్తం 13 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని దొంగల మాటలను నమ్మి ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని ఎమ్మెల్యే సూచించారు
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు
కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదుని రెడ్డి గారు, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి గారు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, వనపర్తి పట్టణ ప్రముఖ వైద్యులు పగిడాల శ్రీనివాస్ గారు, పట్టణాధ్యక్షులు వెంకట్రాములు గారు, నాయకులు రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, సత్యం, రాములు యాదవ్ గారు, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ గారు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : ఓటమి భయంతో కొందరు నాయకులు చిల్లర రాజకీయలు చేస్తున్నారు )

