ఈనెల 17న జరిగే “పెన్షనర్స్ డే” ను జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/ వినుకొండ : ఈనెల 17వ తేదీన పెన్షనర్స్ డే, 18వ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘం, వినుకొండ తాలూకా ప్రధాన కార్యదర్శి కె. కృష్ణమూర్తి తెలిపారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనం నందు ఉదయం 9 గంటలకు పతాక ఆవిష్కరణతో మొదలయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసిల్దార్ ఎస్. సురేష్ నాయక్, ఉప ఖజానా అధికారి బి హెచ్ పి. శేష సాయి, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ పి. కోటేశ్వరరావు హాజరవుతారని అన్నారు. ముఖ్య అతిధుల సందేశం అంతరం 75 సంవత్సరాలు నిండిన 36 మంది పెన్షనర్లకు ఆత్మీయ సన్మానం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పెన్షనర్ల సంఘ సభ్యులందరూ హాజరవ్వాలని కోరారు.(Story:ఈనెల 17న జరిగే “పెన్షనర్స్ డే” ను జయప్రదం చేయండి)

