చింతూరు క్రికెట్ అసోసియేషన్ (సి సి ఏ) క్రీడలను ప్రారంభించిన జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్
న్యూస్ తెలుగు /చింతూరు :
చింతూరు క్రికెట్ అసోసియేషన్ సిసిఏ ఆధ్వర్యంలో చింతూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకెసి ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేశారు. టాస్ గెలిచిన ఎస్ఎఫ్ఐ ఎవెంజర్స్ బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఎవెంజర్ సీసీఏ లు తొలి మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో సి సి ఏ వారు గెలుపొందారు. క్రీడలను ఉద్దేశించి జమాల్ ఖాన్ మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యాభివృద్ధిని గ్రామాభివృద్ధి దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయని చెడు వ్యసనాల నుండి దూరం ఉంచడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడే విషయంలో క్రీడలు ఎంతో తోడ్పడుగా ఉంటాయన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు వెళ్లే ఉన్నత అవకాశం ఒక క్రీడలకే ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. క్రీడా స్ఫూర్తితో ఆడాలని గెలుపు ఓటములు అనేవి సహజమైనవని ఓటమి గెలుపునకు పునాది అవుతుందని ఓడిన వారు నిరుత్సాహ పడకుండా పట్టుదలతో ఆడితే సాధించవచ్చని ఆయన ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సూచించారు. ఈ క్రీడలకు మొదటి బహుమతి 50 వేల రూపాయలు, రెండవ బహుమతి 30 వేల రూపాయలు మరియు రన్నర్స్ విన్నర్స్ కు మంచి విలువైన కప్పులను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ క్రీడాకారులు హసన్ అలీ, ప్రదిప్, రియాజ్, గణేష్,శంకర్,మురలి ,రాజు పెద్దలు ఇల్లా చిన్నారెడ్డి, పి సాల్మన్ రాజు, బట్ట లక్ష్మణ్ నర్సింహారావు,సురేష్ తదితరులు పాల్గొన్నారు. (Story:చింతూరు క్రికెట్ అసోసియేషన్ (సి సి ఏ) క్రీడలను ప్రారంభించిన జెకెసి ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్)

