ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిక
న్యూస్ తెలుగు/వనపర్తి : గోపాల్ పేట మండలం మన్నన్నూరు గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.పుష్పలత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. పుష్పలతతో పాటు మద్దిలేటి,బాలయ్య చేరారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మూడవసారి మున్న నూరు గ్రామ సర్పంచిగా బి.ఆర్.ఎస్ అభ్యర్థి విజయం సాగించాలని కోరారు. నాయకులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో నందిమల్ల అశోక్,రైతు సమితి అధ్యక్షులు తిరుపతయ్య,మాజీ సర్పంచ్ శేఖర్,ఆనంద్,చంద్రశేఖర్,యాదగిరి,నాయకులు దేవర్ల.నరసింహ,నాగన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిక )

