ఏనుగు పాలెంలో ఉచిత పశువైద్య శిబిరం
న్యూస్ తెలుగు /వినుకొండ : పాడి పశువులు ఉన్న రైతులు ప్రభుత్వం సబ్సిడీపై గేదేలకు ఆడదూడ జన్మించే సెక్స్ స్టార్టెడ్ సెమెన్ ను సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్ నేలవల్లి శ్రీరాములు తెలిపారు. వినుకొండ మండలంలోని ఏనుగుపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ రాష్ట్రీయ గోకుల్ మిషన్ అధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 24 గేదేలకు గర్బకోశ, చూడి పరీక్షలు, 22 గేదేలకు సాధారణ చికిత్సలకు వైద్యం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడి డాక్టర్ నేలవల్లి శ్రీరాములు మాట్లాడుతూ. పాడి రైతులకు ఇటువంటి పశువైద్య శిబిరాలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తాయని, ప్రతి ఒక్కరూ పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు మినరల్ మిక్చర్స్, నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మండలం పశువైద్యాధికారి డాక్టర్ పి.అమీర్ భాషా, నూజండ్ల మండలం పశువైద్యాధికారి డాక్టర్ డి.శివాజీ, గ్రామ నాయకులు మాదినేని ఆంజనేయులు, గుమ్మా సీతా రామయ్య, గుమ్మా మల్లికార్జున, షేక్ పెద్ద నాగుర్ వలి, పశుసంవర్ధక సిబ్బంది పాల్గొన్నారు. (Story:ఏనుగు పాలెంలో ఉచిత పశువైద్య శిబిరం)

