Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌బహిరంగంగా జంతు వదలు నిషేధం..

బహిరంగంగా జంతు వదలు నిషేధం..

బహిరంగంగా జంతు వదలు నిషేధం..

న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా.షేక్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బహిరంగంగా జంతువధ నిర్వహించే ప్రాంతాలపై పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం తో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పట్టణంలోని నడిబొడ్డున ఎన్నో ఏళ్లుగా బహిరంగంగా , పాదచారులకు భక్తులకు అసౌకర్యంగా పరిణమిస్తున్న ముఖ్యమైన సమస్య పల్నాడు రోడ్ స్వీపర్స్ కాలనీ నందు ప్రతి గురువారం, ఆదివారం జరిపే జంతువధ కార్యక్రమం పూర్తిగా నిషేధించడమైనదని, ఈ బీఫ్ స్టాళ్లను తిమ్మాయిపాలెం రోడ్ నందు గల కబేళా వద్ద పశువైద్యల పరీక్షలానంతరం జంతువధ గావించి, మున్సిపాలిటీ వారు సుమారు 10 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్స్ యందు మాత్రమే మాంసవిక్రయం చేసుకోవలెనని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కావున జంతుమాంస వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి తమ బీఫ్ స్టాల్స్ ను తిమ్మయిపాలెం రోడ్ నందు కబేళా వద్దకు మార్చుకోవాలని, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి పురపాలక సంఘం కు సహకరించాల్సిందిగా కోరారు. ఈ నిబంధనలను అతిక్రమించిన యడల చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఉదయలక్ష్మి , పోలీస్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ , శానిటరీ సెక్రటరీలు, మేస్త్రిలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. (Story:బహిరంగంగా జంతు వదలు నిషేధం..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!