తుఫాన్ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇటీవల సంభవించిన తుఫాను వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టం పై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు చీప్ విప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వివిధ శాఖలకు చెందిన అధికారులు జరిగిన నష్టం పై అంచనాలు వేసి ఉన్నతాధికారులకు పంపినట్లు ఎమ్మెల్యే జీవీ ఎదుట వివరించారు. 92 కిలోమీటర్లు గల 6 రోడ్లకు, 6 కోట్ల 47 లక్షలు అంచనా వేసి పంపినట్లు సంబంధిత అధికారి వివరించారు. అలాగే పిఆర్ . 15 రోడ్లకు 43 కోట్లు కోరినట్టు తెలిపారు. ఇక వీఆర్ఏ 17 వర్కులకు 34.9 లక్షలు లోకల్ గ్రాండ్ లో పెట్టినట్లు వివరించారు. వ్యవసాయ శాఖ 155 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా 15 లక్షలు హార్టికల్చర్ మిర్చి 269 ఎకరాలు పంట నష్టం జరిగి 44 మంది రైతులు నష్టపోగా 19 లక్షలు అంచనా వేశామన్నారు. అలాగే గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో విద్యుత్ మోటార్లు కు. 89 లక్షలు అంచనా వేయగా వీటిలో 36 విద్యుత్ పోల్స్, 72 ఎల్టిలైన్స్, 76 పోల్స్ పడిపోయాయన్నారు. అలాగే అగ్రికల్చర్ సంబంధించిన 103 ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ కాగా, 500 మంది రైతులకు నష్టం జరగా, 35 లక్షలు అంచనా వేశామన్నారు. అలాగే 15 చెరువులు దెబ్బతినగా మరమ్మతులకు కోటి 30 లక్షలు అంచనా వేసి ప్రభుత్వానికి పంపినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. వీటన్నింటిపై పరిశీలించి తక్షణ సహాయం పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు.(Story : తుఫాన్ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు)

